Beast Movie Trailer : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న విజ‌య్ బీస్ట్ మూవీ ట్రైల‌ర్‌..!

April 2, 2022 10:58 PM

Beast Movie Trailer : త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డెలు జంట‌గా న‌టిస్తున్న చిత్రం.. బీస్ట్‌. ఈ మూవీ లోంచి రెండు పాటలు ఈ మ‌ధ్యే విడుద‌ల కాగా వాటిల్లో అర‌బిక్ కుతు అనే సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఎంత‌లా అంటే.. ఈ పాట‌కు ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు సైతం డ్యాన్స్‌లు చేసి త‌మ ముచ్చ‌ట‌ను తీర్చుకున్నారు. ఇక శ‌నివారం ఈ సినిమాకు చెందిన ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. ఇది ఒక రేంజ్‌లో ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Beast Movie Trailer become sensation in social media
Beast Movie Trailer

బీస్ట్ మూవీలో విజ‌య్.. వీర‌రాఘ‌వ‌న్ అనే గూఢ‌చారి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శకత్వం వ‌హించారు. ఈ మూవీ మొత్తం ఒక షాపింగ్‌మాల్‌లో జ‌రుగుతుంద‌ని ట్రైల‌ర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయ‌ని ట్రైల‌ర్‌ను చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఒక మాల్‌లో చొర‌బ‌డ్డ ఉగ్ర‌వాదులు దాన్ని త‌మ అధీనంలోకి తెచ్చుకుంటారు. అయితే అనుకోకుండా అదే మాల్‌లో ఉన్న గూఢ‌చారి వీర‌రాఘ‌వ‌న్ ఉగ్ర‌వాదుల ఆట‌క‌ట్టిస్తాడు. ఈ క‌థాంశంతో సినిమా తీశార‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది.

ఇక ఈ మూవీ ట్రైల‌ర్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఏకంగా త‌మిళ‌నాడులో థియేట‌ర్ల వ‌ద్ద క్యూ కట్టారంటే బీస్ట్ ఫీవ‌ర్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. సోష‌ల్ మీడియాను సైతం ఈ ట్రైల‌ర్ షేక్ చేస్తోంది. ఈ ట్రైల‌ర్‌ను లాంచ్ చేసిన 15 నిమిషాల‌కే దీనికి 20 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. అలాగే 2.60 ల‌క్ష‌ల లైక్స్ వ‌చ్చాయి. ఇక ఈ మూవీని ఏప్రిల్ 13వ తేదీన భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment