Bandla Ganesh : గత కొద్ది రోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంతో రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలోనే నువ్వా -నేనా అన్నట్టుగా ఈ ఎన్నికల కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్ అయినటువంటి బండ్ల గణేష్ మొదట్లో ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలపగా తన టీంలోకి జీవిత రాజశేఖర్ రావడం చేత బండ్లగణేష్ స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీకి దిగారు.

ఈ క్రమంలోనే నామినేషన్ దాఖలు చేసిన బండ్లగణేష్ చివరి నిమిషంలో తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అదేవిధంగా తన మద్దతు ప్రకాష్ రాజ్ కు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తన నామినేషన్ ఉపసంహరించుకుంటూ.. నా దైవ సమానులు, నా శ్రేయోభిలాషులు ఆత్మీయుల సూచనల మేరకు నేను ఈ జనరల్ సెక్రటరీ నామినేషన్ ను ఉపసంహరించుకున్నానని.. ఈ సందర్భంగా తెలియజేశారు.
https://twitter.com/ganeshbandla/status/1443862581450457092
ఇలా ఉన్నఫలంగా బండ్ల గణేష్ ఎన్నికల నామినేషన్ ను ఉపసంహరించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాను చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్టోబర్ 10వ తేదీన జరిగే ఈ ఎన్నికలలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్రమైన పోటీ ఉండడం చేత ఎవరు గెలుస్తారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు.












