Bandla Ganesh : ప్లీజ్.. ద‌య‌చేసి దాని గురించి అడ‌గొద్దు.. అని కోరిన బండ్ల గ‌ణేష్..!

April 15, 2022 1:13 PM

Bandla Ganesh : బండ్ల గ‌ణేష్ ఒక‌ప్పుడు ఎంతో వార్త‌ల్లో నిలిచారు. కానీ ఇప్పుడు ఆయ‌న పెద్ద‌గా బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో కూడా ఆయ‌న పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఎప్పుడో ఒక పోస్ట్ త‌ప్ప ఆయ‌న ద‌ర్శ‌న భాగ్య‌మే కరువైపోయింది. అయితే తాజాగా ఈయ‌న మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. ఓ అభిమాని వేసిన ప్ర‌శ్న‌కు ఆయ‌న బ‌దులిచ్చారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

Bandla Ganesh requested not to ask about politics
Bandla Ganesh

బండ్ల గ‌ణేష్ గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం విదిత‌మే. అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్‌తో తాను గొంతు కోసుకుంటాన‌ని.. బండ్ల గ‌ణేష్ అప్ప‌ట్లో వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ ఆయ‌న చెప్పిన ప‌ని మాత్రం చేయ‌లేదు. దీంతో బండ్ల గ‌ణేష్‌ను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. బ్లేడ్ ప‌ట్టుకుని తిరుగుతూ.. బండ్ల గ‌ణేష్ ఎక్క‌డ‌.. అని చాలా మంది మీమ్స్ చేశారు.

అయితే ఆ ట్రోల్స్‌కు స్పందించిన బండ్ల గ‌ణేష్.. త‌న‌ను వదిలేయాల‌ని కోరారు. దీంతో ఆయ‌న‌పై ట్రోల్స్ ఆగిపోయాయి. కానీ ఆయ‌న‌పై త‌ర‌చూ ఏదో ఒక విష‌య‌మై మీమ్స్ వ‌స్తూనే ఉంటాయి. అయితే వాటికి ఆయ‌న స్పందించరు. కానీ ట్విట్ట‌ర్‌లో ప‌లువురు అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఆయ‌న బ‌దులిస్తుంటారు. ఇక తాజాగా ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న రిప్లై ఇచ్చారు.

బండ్ల అన్న‌.. మీరు అంటే నాకు చాలా అభిమానం.. మీరు బాగా మాట్లాడ‌తారు. మీరు బీజేపీలో చేరితే బాగుంటుంది.. అని కోరాడు. దీంతో స్పందించిన బండ్ల గ‌ణేష్.. ప్లీజ్‌.. రాజ‌కీయాలు మాట్లాడొద్దు.. అని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. అయితే బండ్ల గ‌ణేష్ ప్ర‌స్తుతం రాజ‌కీయాలు వ‌దిలి సినిమాల నిర్మాణంపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment