Bandla Ganesh : ప్రజా రాజ్యం పార్టీని స్థాపించాక రాజకీయాలకు తాను సెట్ కానని చెప్పి మెగాస్టార్ చిరంజీవి ఆ రంగానికి పూర్తిగా దూరమయ్యారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుసగా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. రాజకీయాల జోలికి అసలు వెళ్లడం లేదు. అయితే తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో మెగాస్టార్ చిరంజీవి చేరాలని ఎప్పటి నుంచో మెగా అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే నాగబాబు ఆ పార్టీలో ఉండి పవన్‌కు చేదోడు వాదోడుగా ఉన్నారు. దీంతో చిరంజీవి కూడా రావాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అది కూడా సోషల్ మీడియా వేదికగా కావడం విశేషం.
బండ్ల గణేష్ సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. మెగా అభిమానులు చేసే పోస్టులకు ఆయన రిప్లై ఇస్తుంటారు. ఆయన పవన్‌కు వీరాభిమాని అన్న విషయం విదితమే. అయితే తాజాగా ఓ అభిమాని.. చిరంజీవిని జనసేనలోకి రావాల్సిందిగా కోరాడు. జనసేనలోకి చిరంజీవి వచ్చి పార్టీని అధికారంలోకి తేవాలని, మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించాలని, ఏపీ ప్రజలను ఆదుకోవాలని కోరుతూ.. ఓ అభిమాని ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌కు ఆశ్చర్యకరంగా బండ్ల గణేష్ రిప్లై ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని.. ప్రజా సేవ చేయాలని.. జనసేనలో చేరి ఏపీలో అధికారంలోకి రావాలని.. ఓ అభిమాని కోరగా.. అందుకు బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ.. మరి నేను ? అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆ అభిమాని చేసిన ట్వీట్‌ను కూడా జోడించారు. దీంతో ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి జనసేనలోకి వచ్చే విషయంపై.. మళ్లీ చర్చ నడుస్తోంది. అయితే ఇదంతా సరదాకే కానీ.. వాస్తవానికి చిరంజీవికి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అదే ఉంటే.. ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా.. తిరిగి ఏదో ఒక పార్టీలో చేరి కొనసాగి ఉండేవారు. కానీ ఆయన ఇప్పుడు మళ్లీ పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారు. కనుక చిరంజీవి ఇప్పట్లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…