Chiranjeevi : బండ్ల గణేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సోషల్ మీడియా వేదికగా లేదా ఏదైనా కార్యక్రమంలోనైనా మాట్లాడారంటే అది మెగా కుటుంబం గురించే మాట్లాడతారు. ఈయన మెగా కుటుంబానికి పెద్ద అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ సంబోధించే బండ్లగణేష్.. మెగాస్టార్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. తాజాగా బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన ట్వీట్, షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హైదరాబాద్ అమీర్ పేట్ లో యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అజహరుద్దీన్, పుల్లెల గోపీచంద్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ సినీ ఇండస్ట్రీ వారికి ఏదైనా సహాయం చేయగలరా.. అంటూ ఎంతో సవినయంగా అడిగారు.
ఈ క్రమంలోనే ఆ సెంటర్ అధినేత స్పందిస్తూ.. మా మెంబర్స్.. అలాగే 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్, సెలబ్రిటీలకు యోధ డయాగ్నస్టిక్ సెంటర్ తరఫున 50 శాతం డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. ఆర్టిస్టుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా అడగడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. మీరు సూపర్ సార్.. మాట్లాడటానికి మాటలు రావడం లేదు.. అంటూ బండ్ల గణేష్ మరోసారి మెగా కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…