Ban Pak Cricket : పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడ‌కండి.. ప్లీజ్‌.. పాక్ జ‌ట్టును బ్యాన్ చేయండి..!

October 17, 2021 9:36 PM

Ban Pak Cricket : నిన్న మొన్న‌టి వ‌ర‌కు భార‌త క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ మ‌త్తులో మునిగి తేలారు. ఇక మ‌రికొద్ది రోజుల్లో పొట్టి క్రికెట్ క‌ప్ కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే దుబాయ్‌లో ప్రారంభం కానున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా భార‌త్ త‌న మొద‌టి మ్యాచ్‌ను ఈ నెల 24వ తేదీన పాకిస్థాన్‌తో ఆడ‌నుంది. కానీ ఆ దేశంతో మ్యాచ్ ఆడొద్ద‌ని అభిమానులు కోరుతున్నారు.

Ban Pak Cricket hash tag trending in twitter

ట్విట్ట‌ర్‌లో #ban_pak_cricket పేరిట భార‌త అభిమానులు ఓ హ్యాష్ టాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. తాజాగా శ్రీ‌న‌గ‌ర్‌లో జ‌రుగుతున్న ఉగ్ర‌దాడుల్లో భార‌త బ‌ల‌గాలు ఎన్ కౌంట‌ర్ చేస్తూ ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చుతున్నాయి. ఈ దాడుల్లో కొంద‌రు సాధార‌ణ పౌరులు, సిబ్బంది చ‌నిపోయారు. అయితే ఉగ్ర‌వాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ తో మ్యాచ్ ఆడొద్ద‌ని భార‌త క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.

https://twitter.com/truebytess/status/1449720360706854915?s=20

పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడ‌క‌పోతే కేవ‌లం 2 పాయింట్లు మాత్ర‌మే పోతాయి.. భార‌త్‌కు వ‌చ్చే న‌ష్టం ఉండ‌దు. దీంతో ప్ర‌పంచ దేశాల‌కు పాక్ అస‌లు రంగు తెలుస్తుంది.. అందువ‌ల్ల పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడొద్దు.. ప్లీజ్‌.. అంటూ కొంద‌రు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం.. పాక్‌తో మ్యాచ్ ఆడి వారిని చిత్తుగా ఓడించాల‌ని.. అప్పుడు వారి ప‌రువు తీసిన‌ట్ల‌వుతుంద‌ని అంటున్నారు. ఇక కొంద‌రైతే ఏకంగా పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టును బ్యాన్ చేయాల‌ని ఐసీసీని కోరుతున్నారు. ఈ క్ర‌మంలో మ్యాచ్ రోజు ఏ విధంగా ప‌రిస్థితులు ఉంటాయోన‌ని స‌ర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment