Sirivennela : తన పదాలతో ప్రతి ఒక్కరికీ ఆహ్లాదాన్ని పంచిన లెజండరీ రైటర్ సిరివెన్నెల మంగళవారం సాయత్రం 4 గంటల 7 నిమిషాల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల అస్తమించడంతో సినీ ప్రపంచం మూగబోయింది. కవిత్వానికి ఒంపులు, అక్షరంలో అందాలు గుర్తించిన ఆయన ఇక తిరిగి రారాని తెలిసి అందరూ శోకసంద్రంలో మునిగారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు.
సిరివెన్నెలకు తుది నివాళులు అర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ఫిలింఛాంబర్‌కు తరలివస్తున్నారు. బుధవారం ఉదయం సిరివెన్నెల పార్థివదేహాన్ని త్రివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, తనికెళ్ల భరణి, మణిశర్మ, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎస్వీ కృష్ణారెడ్డి, మారుతి, మురళీమోహన్, నందినీరెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ కూడా సిరివెన్నెల భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సిరివెన్నెలని ఇలా చూసి చాలా ఎమోషనల్ అయిన ఆయన .. ఈరోజు చాలా దుర్దినం అని… ఒక నమ్మలేని నిజం… ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 1984లో విశ్వనాథ్ దర్శకత్వంలో తాను నటించిన జననీ.. జన్మభూమి.. చిత్రంతోనే సిరివెన్నెల సినీ పరిశ్రమకు పరిచయం కావడం తన అదృష్టమన్నారు. సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉందన్నారు. సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశారు. పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకే సిరివెన్నెల వెళ్లిపోయారంటూ బాలయ్య కంటతడి పెట్టుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…