Balakrishna : సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండండి.. విద్యార్థుల‌కు బాల‌కృష్ణ సూచ‌న‌..

August 19, 2022 6:27 PM

Balakrishna : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ నాటి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని దాదాపుగా 5900 ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌ను హైస్కూల్స్ లో విలీనం చేశారు. దీనిపై విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. కానీ ప్ర‌భుత్వం మాత్రం ఆ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌ ఇంకా ఇత‌ర కార‌ణాలతోనే విలీనం చేయ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని చెబుతోంది. అయితే న‌టుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాల‌కృష్ణ దీనిపై మాట్లాడుతూ ప్ర‌భుత్వం విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతుంద‌ని ఆరోపించారు.

ఆయ‌న ఈ మ‌ధ్య తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజ‌క వ‌ర్గానికి చెందిన‌ కొట్నూర్ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 30 ఎల్ఈడీ టీవీల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పాఠ‌శాల‌ల విలీనం రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన‌ త‌ప్పుడు చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. దాని వల్ల విద్యార్థులు బ‌డికి వెళ్లే దూరం ఎక్కువై ర‌వాణా సౌక‌ర్యం లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు. రాష్ట్రంలోని రోడ్ల‌న్నీ పాడైపోయాయ‌ని ప్ర‌భుత్వం వాటిని బాగుచేయించ‌కుండా నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ని విమ‌ర్శించారు. వివిధ ర‌కాలుగా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను బాదుడే బాదుడు చేస్తుంద‌ని, తాము కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అలాగే చేసి చూపిస్తామ‌ని వాఖ్యానించారు.

Balakrishna said that students should be away from social media
Balakrishna

ఇక నంద‌మూరి బాల‌కృష్ణ విద్యార్థుల‌కు స‌ల‌హా ఇస్తూ వారు సోష‌ల్ మీడియాకి, మొబైల్ ఫోన్ల‌కి దూరంగా ఉండాల‌ని సూచించారు. వారికి ఆనందించ‌డానికి ఎన్నో మార్గాలు ఉన్నాయ‌ని, కాబ‌ట్టి సోష‌ల్ మీడియా జోలికి వెళ్ల‌కూడ‌ద‌ని చెప్పారు. మ‌నం ఏదైనా చేస్తే అది నాలెడ్జ్ ని పెంచే విధంగా ఉండాల‌ని అన్నారు. అయితే హెరిటేజ్ గ్రూప్ వారు ఈ ఎల్ఈడీ టీవీల‌ను అందించ‌గా బాల‌కృష్ణ త‌న ఆర్గ‌నైజేష‌న్ ద్వారా 4 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఈ స్కూల్ కి డొనేష‌న్ గా ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment