Balakrishna : బాల‌య్య త‌న సినీ కెరీర్‌లో వ‌దులుకున్న 10 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు ఇవే..!

May 29, 2022 3:08 PM

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఆయ‌న ఫ్యాన్స్ బాల‌య్య అని పిలుచుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌పై ఉన్న అభిమానంతో వారు ఆయ‌న‌ను అలా పిలుచుకుంటారు. అయితే ఫ్యాన్స్‌ను మాత్ర‌మే కాదు.. ఆయ‌న త‌న సినిమాల‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటారు. ఆయ‌న ఈ మ‌ధ్య కాలంలో చేసిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా అఖండ మూవీతో ఆయ‌న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. క‌రోనా త‌రువాత వ‌చ్చిన చిత్రం అయిన‌ప్ప‌టికీ అఖండ‌కు ప్రేక్ష‌కులు బ్రహ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇక త్వ‌ర‌లోనే దీనికి రెండో పార్ట్‌ను కూడా తీయాల‌ని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ప్లాన్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌బీకే 107 వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. ఇందులో శృతి హాస‌న్ న‌టిస్తోంది. ఈ మూవీ అనంత‌రం బాల‌య్య అనిల్ రావిపూడి సినిమాలో చేస్తారు. ఆ త‌రువాతే అఖండ 2 ఉంటుంది. అయితే బాల‌కృష్ణ త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో ర‌కాల చిత్రాల్లో న‌టించారు. పౌరాణిక‌, జాన‌ప‌ద‌, సాంఘిక చిత్రాల్లో ఆయ‌న యాక్ట్ చేశారు. కానీ కొన్ని ఇత‌ర హీరోల సినిమాలు కూడా ముందుగా ఆయ‌న వ‌ద్ద‌కే వ‌చ్చాయి. వాస్త‌వానికి ఆయ‌న వాటిని చేయాల్సి ఉంది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ప‌లు సినిమాల‌ను ఆయ‌న రిజెక్ట్ చేశారు. అయితే వాటిల్లో ఇత‌ర హీరోలు చేశారు. దీంతో అవి హిట్ అయ్యాయి. ఇక బాల‌కృష్ణ త‌న సినీ కెరీర్‌లో వ‌దులుకున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Balakrishna rejected these 10 blockbuster hit movies
Balakrishna

అప్ప‌ట్లో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన చంటి చిత్రం ఎంత‌టి హిట్ ను సాధించిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ మూవీని బాల‌కృష్ణతో చేయాల‌నుకున్నార‌ట‌. కానీ క‌థ న‌చ్చ‌క ఆయ‌న దీన్ని రిజెక్ట్ చేశారు. త‌రువాత రాజ‌శేఖ‌ర్ సింహ రాశి మూవీ, వెంక‌టేష్ సూర్య వంశం, జ‌గ‌ప‌తిబాబు శివ‌రామ‌రాజు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న‌వ‌రం సినిమాల్లోనూ బాల‌య్య న‌టించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ఆయ‌న ప‌లు కార‌ణాల‌తో రిజెక్ట్ చేశారు.

ఇక అప్ప‌ట్లో నాగార్జున హీరోగా వ‌చ్చిన జాన‌కి రాముడు మూవీని ముందుగా బాల‌య్య‌నే చేయాల్సి ఉంది. కానీ ఆయ‌న చేయ‌లేక‌పోయారు. అలాగే ఈ మ‌ధ్య‌కాలంలో వ‌చ్చిన వెంక‌టేష్ బాడీగార్డ్ మూవీ, సైరా, గ‌తంలో ఎన్‌టీఆర్ న‌టించిన సింహాద్రి, ఇటీవ‌ల వ‌చ్చిన ర‌వితేజ క్రాక్ మూవీల‌ను కూడా బాల‌కృష్ణ‌నే ముందుగా చేయాల‌ని అనుకున్నార‌ట‌. కానీ ఆ మూవీల‌ను చేయ‌లేక‌పోయారు. అయితే వీటిల్లో రెండు మూడు సినిమాలు మిన‌హా అన్నీ హిట్టే అయ్యాయి. అదే గ‌నుక ఆ మూవీల‌ను బాల‌య్య చేసి ఉంటే.. ఆయన ఖాతాలో ఇంకొన్ని హిట్ సినిమాలు వ‌చ్చి ఉండేవి. దీంతో బాల‌య్య ఇంకాస్త పై మెట్టులో ఉండేవారు. ఇక బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని సినిమాతో బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment