Balakrishna : ఏపీలో కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న‌పై బాల‌కృష్ణ ఏమ‌న్నారంటే..?

January 27, 2022 8:16 PM

Balakrishna : ఏపీలో సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల‌ను ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. వాటిల్లో ప‌లువురు ప్ర‌ముఖుల పేరిట జిల్లాలు ఉన్నాయి. ఎన్‌టీఆర్ పేరిట కూడా జిల్లాను ప్ర‌క‌టించారు. అయితే ఈ విష‌యంపై హిందూపూర్ ఎమ్మెల్యే, న‌టుడు బాల‌కృష్ణ ఎట్ట‌కేల‌కు స్పందించారు.

Balakrishna comment on andhra pradesh new districts

కొత్త జిల్లాల ఏర్పాటును బాల‌కృష్ణ స్వాగతించారు. అయితే ఎన్‌టీఆర్ జిల్లాపై ఆయ‌న ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. కానీ శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాకు హెడ్ క్వార్ట‌ర్స్‌గా హిందూపూర్ ఉండాల‌ని అన్నారు. దీని వ‌ల్ల హిందూపూర్ ప్ర‌జ‌ల సెంటిమెంట్ల‌ను గౌర‌వించిన‌ట్లు అవుతుంద‌ని అన్నారు.

కాగా ఎన్‌టీఆర్ జిల్లా ప్ర‌క‌ట‌న‌పై ఎన్టీఆర్ ఫ్యామిలీలో కొంద‌రు స్పందించారు. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, నంద‌మూరి రామ‌కృష్ణ‌లు ఈ నిర్ణ‌యాన్ని స్వాగతించారు. కానీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు మాత్రం దీనిపై కామెంట్ చేయ‌లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now