Balakrishna : ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ వెండితెరకు పరిచయమై తన అద్భుతమైన నటనతో ఎన్నో చిత్రాలతో ఘనవిజయం అందుకున్నారు. బాలయ్య బాబుకి అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేవిధంగా నిర్మాత డి.రామానాయుడు సినీ వారసుడిగా కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ అద్భుతమైన నటనతో తనకంటూ ఒక సపరేట్ ట్రెండ్ ను సెట్ చేసుకున్నారు.
అయితే టాలీవుడ్ తోపాటు వివిధ సినీ పరిశ్రమలలో సంక్రాంతి, సమ్మర్ స్పెషల్ అంటూ టాప్ హీరోల సినిమాలు థియేటర్ల వద్ద పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా సమ్మర్ స్పెషల్ గా ఒకే రకమైన స్టోరీ లైన్‌లో ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగిన బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలేవో తెలుసా.. బాలకృష్ణ హీరోగా నటించిన అశోక చక్రవర్తి మరియు వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రం ఒకే రోజు దగ్గర దగ్గరగా ఒకే కథాంశంతో ప్రేక్షకులను అలరించడం కోసం థియేటర్ లోకి వచ్చేశాయి.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఆర్యన్ సినిమాకు రీమేక్ గా బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ సినిమాను ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమా 1989 జూన్ 29న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణకు జంటగా భానుప్రియ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి గాను ఇళయరాజా సంగీతం అందించారు. అంతేకాదు ఈ సినిమాలో పాటలు అప్పట్లో మ్యూజికల్‌గా హిట్ అయ్యాయి.
ఇక మరోవైపు వెంకటేష్ హీరోగా ధ్రువనక్షత్రం కూడా దాదాపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రమే. ఈ చిత్రానికి వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా దాదాపు మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న ఆర్యన్ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. వెంకటేష్ ధ్రువ నక్షత్రం చిత్రం కూడా 1989 జూన్ 29న థియేటర్లలో విడుదలైంది. ధ్రువ నక్షత్రం చిత్రంలో వెంకటేష్ సరసన రజినీ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. ఈ రెండు చిత్రాలకు ఉన్న మరొక విశేషం ఏంటంటే.. మాటల రచయితలుగా పరుచూరి బ్రదర్స్ పనిచేయటం.
మొత్తంగా ఒక తరహా కథతో వచ్చిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం, వాటికి మాటలు రాసిన రచయతలు కూడా ఒకరే కావడం మరో విచిత్రమనే చెప్పాలి. సమ్మర్ స్పెషల్ గా బాక్సాఫీస్ బరిలో దిగిన ఇద్దరి సినిమాలలో వెంకటేష్ నటించిన ధృవనక్షత్రం సినిమా సూపర్ హిట్ ను అందుకోగా, బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి బాక్సాఫీస్ బరిలో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…