Balakrishna : బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ అనే కార్యక్రమానికి తొలి గెస్ట్‌గా హాజరైన మోహన్ బాబు మందు గురించి ఆసక్తికరమైన ముచ్చట్లు పెట్టారు. ముందుగా మోహన్ బాబు మాట్లాడుతూ.. మద్రాసులో కోడంబాకం బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద వరుసగా సారా దుకాణాలుండేవి. నా ఫ్రెండ్‌తో కలిసి అక్కడికి వెళ్లే వాళ్లం. ఇద్దరం కలిసి చెరో 25 పైసలు పెట్టి సారా తాగేవాళ్లం. అక్కడే రిక్షావాళ్లు ఉండేవారు, ఏదో పచ్చడి నాకేవాళ్లు. మేం కూడా అదే చేశాం.
ఇప్పుడు దేవుడి దయ వలన సంపాదించుకున్నాను. మంచి విస్కీ తాగుతున్నాను అని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. ఇక బాలకృష్ణ మాట్లాడుతూ.. “నా మందు అలవాటు గురించి అందరికీ తెలిసిందే. నేను మేన్సన్ హౌజ్ తాగుతాను. నాకు ఒక ఇల్లు ఉంది. అది కూడా పెద్ద మేన్సన్ హౌజ్. రాత్రికి ‘మామ ఏక్ పెగ్ లా’ ఉంటుంది. పొద్దున్నే మూడున్నర లేదా 4 గంటలకు లేస్తాను.
కేబీఆర్ పార్క్‌లో నిత్యం జాగింగ్ చేస్తుంటాను. గేట్ తెరవకపోవడం వలన ఒక్కో సారి గోడ దూకి పోయేవాడిని. అప్పట్లో చాలామందికి అలా గోడ దూకడం నేర్పించాను అంటూ బాలకృష్ణ, మోహన్ బాబు ఆసక్తికరమైన ముచ్చట్లు పెట్టారు. ఇక షోలో చిరంజీవి గురించి, తన సినిమాల గురించి పలు విషయాలు అడిగారు బాలకృష్ణ. వాటన్నింటికీసమాధానాలు చెప్పారు మోహన్ బాబు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…