Balakrishna : బాల‌కృష్ణ‌ – మోహ‌న్ బాబు.. మందు ముచ్చ‌ట్లు..!

November 5, 2021 1:21 PM

Balakrishna : బాల‌య్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ అనే కార్య‌క్ర‌మానికి తొలి గెస్ట్‌గా హాజ‌రైన మోహ‌న్ బాబు మందు గురించి ఆస‌క్తిక‌ర‌మైన ముచ్చ‌ట్లు పెట్టారు. ముందుగా మోహ‌న్ బాబు మాట్లాడుతూ.. మద్రాసులో కోడంబాకం బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద వరుసగా సారా దుకాణాలుండేవి. నా ఫ్రెండ్‌తో క‌లిసి అక్క‌డికి వెళ్లే వాళ్లం. ఇద్దరం కలిసి చెరో 25 పైసలు పెట్టి సారా తాగేవాళ్లం. అక్కడే రిక్షావాళ్లు ఉండేవారు, ఏదో పచ్చడి నాకేవాళ్లు. మేం కూడా అదే చేశాం.

Balakrishna and mohan babu talked about drinking in their show

ఇప్పుడు దేవుడి ద‌య వ‌ల‌న సంపాదించుకున్నాను. మంచి విస్కీ తాగుతున్నాను అని మోహ‌న్ బాబు చెప్పుకొచ్చాడు. ఇక బాల‌కృష్ణ మాట్లాడుతూ.. “నా మందు అలవాటు గురించి అందరికీ తెలిసిందే. నేను మేన్సన్ హౌజ్ తాగుతాను. నాకు ఒక ఇల్లు ఉంది. అది కూడా పెద్ద మేన్సన్ హౌజ్. రాత్రికి ‘మామ ఏక్ పెగ్ లా’ ఉంటుంది. పొద్దున్నే మూడున్నర లేదా 4 గంటలకు లేస్తాను.

కేబీఆర్ పార్క్‌లో నిత్యం జాగింగ్ చేస్తుంటాను. గేట్ తెర‌వ‌క‌పోవ‌డం వ‌ల‌న ఒక్కో సారి గోడ దూకి పోయేవాడిని. అప్పట్లో చాలామందికి అలా గోడ దూకడం నేర్పించాను అంటూ బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు ఆస‌క్తికరమైన ముచ్చ‌ట్లు పెట్టారు. ఇక షోలో చిరంజీవి గురించి, త‌న సినిమాల గురించి ప‌లు విష‌యాలు అడిగారు బాలకృష్ణ‌. వాట‌న్నింటికీస‌మాధానాలు చెప్పారు మోహ‌న్ బాబు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now