Akhil Akkineni : అక్కినేని మూడో తరం హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. అందమైన ప్రేమ కథతోపాటు చక్కటి ఎమోషన్స్ తో సాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో మొదటి హిట్‌ను అందుకున్నాడు అఖిల్. ఇప్పుడు ఇదే జోష్‌తో తన నెక్స్ట్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో అఖిల్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తారని తెలుస్తోంది. అఖిల్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మరో హీరోయిన్‌గా తమిళ యువ నటి అతుల్య రవిని ఎంపిక చేశారు. సాక్షికి ఇది తొలి చిత్రం కాగా, అతుల్య ఇంతకుముందు కాదల్ కన్ కట్టుదే, యెమాలి, అడుత సత్తై, నాడోడిగల్ 2 వంటి తమిళ చిత్రాలలో కనిపించింది.
ఇద్దరు హీరోయిన్స్‌లో ఎవరు మొదటి హీరోయిన్, రెండో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు ? అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
మమ్ముట్టిపై బుడాపెస్ట్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మమ్ముట్టి ఆర్మీ ఆఫీసర్ గా అఖిల్ కి ఓ మెంటార్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చేఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…