Ashu Reddy : సముద్రతీరాన అతడి కౌగిలిలో బందీ అయిన అషురెడ్డి.. ఫోటో వైరల్ !

October 7, 2021 11:43 AM

Ashu Reddy : అషు రెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలలో సందడి చేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఈమె ఎక్కువగా ప్రేమ కథనాలతో వార్తల్లో నిలుస్తోంది. గతంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి చేసిన రచ్చ అప్పట్లో బాగా వైరల్ అయింది. తాజాగా ఎక్స్‌ప్రెస్‌ హరితో కూడా అదే స్థాయిలో రచ్చ చేస్తున్న ఈ భామ తమ మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది.

Ashu Reddy spending time with some body at beach

ఇక గత కొద్ది రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ చేసిన ఇంటర్వ్యూ ఈమెకు మరింత క్రేజ్ సంపాదించిందని చెప్పవచ్చు. ఇకపోతే బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూనే ప్రైవేట్ ఆల్బమ్ ల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. గత నెలలో రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి చేసిన ఆల్బమ్ బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే రెండవ ఆల్బమ్ కి ఈమె సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటి నుంచే అషు రెడ్డి తన రెండవ ఆల్బమ్ కి ప్రమోషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు విభిన్న ప్రదేశాల నుంచి.. రెండు జీవితాల ప్రయాణం.. రెండు హృదయాలు.. చివరికి ఒకటిగా కలిశాయి.. అంటూ సముద్ర తీరాన కౌగిలిలో బందీ అయిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఈ ఫోటో షూటింగ్‌లో భాగమని తెలిసినప్పటికీ ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి అషు రెడ్డి ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలు, మరొకవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఎంతో బిజీగా ఉందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment