తపన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు నటి అర్చన. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీ రామరాజ్యం, పౌర్ణమి వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు వేదా అలియాస్ అర్చన. నటిగా మంచి గుర్తింపు ఉన్నా అవకాశాలు లేనివారిలో ఈమె కూడా ఒకరు అని చెప్పవచ్చు. హీరోయిన్లపై సినీ ఇండస్ట్రీలో నెలకొన్న వివక్షపై నటి అర్చన ఘాటుగా స్పందించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్లకు మధ్య ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో కూడా దర్శక నిర్మాతలు భేదాలు చూపిస్తున్నారు అంటూ స్పందించారు.
పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంటూ గత కొంత కాలంగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు అర్చన. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్లీ తెలుగు తెరకు అర్చన దగ్గర కావాలని అనుకుంటున్నారు. ఈ సీనియర్ బ్యూటీ ఇప్పుడు ఇదే విషయంపై మీడియాతో స్పందించారు. ఇతర భాషలలో హీరో హీరోయిన్స్ కి సమానమైన గుర్తింపు ఉంటుంది. కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఫిమేల్ యాక్టర్ కి కావలసిన గుర్తింపు మన టాలీవుడ్‌లో లభించదు.
పెళ్లి అయిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న హీరోకి మాత్రం రెమ్యూనరేషన్ లో ఎటువంటి మార్పు ఉండదు. హీరోల రెమ్యూనరేషన్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. అదే పెళ్లి అయిన హీరోయిన్ కు మాత్రం రెమ్యూనరేషన్ తగ్గించుకోండి అంటూ దర్శక నిర్మాతలు డిమాండ్ చేస్తుంటారు. ఎందుకు ఇలా హీరో హీరోయిన్స్ మధ్య తేడాలు చూపిస్తారు అంటూ అర్చన ఘాటుగా ప్రశ్నించారు. రాబోయే కాలంలోనైనా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ కి మధ్య ఈ భేదం తొలగిపోవాలని ఆశిస్తున్నాను.. అంటూ అర్చన ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…