టాలీవుడ్‌లో హీరోల డామినేష‌న్ ఎక్కువ‌.. న‌టి అర్చ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..

August 8, 2022 9:57 AM

తపన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు నటి అర్చన. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీ రామరాజ్యం, పౌర్ణమి వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు వేదా అలియాస్ అర్చన. నటిగా  మంచి గుర్తింపు ఉన్నా అవకాశాలు లేనివారిలో ఈమె కూడా ఒకరు అని చెప్పవచ్చు. హీరోయిన్లపై సినీ ఇండస్ట్రీలో నెల‌కొన్న వివక్షపై నటి అర్చన ఘాటుగా స్పందించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్లకు మధ్య ఇచ్చే రెమ్యూన‌రేషన్ విషయంలో కూడా దర్శక నిర్మాతలు భేదాలు చూపిస్తున్నారు అంటూ స్పందించారు.

పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంటూ గత కొంత కాలంగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు అర్చ‌న‌. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్లీ తెలుగు తెరకు అర్చన దగ్గర కావాలని అనుకుంటున్నారు. ఈ సీనియర్ బ్యూటీ ఇప్పుడు ఇదే విషయంపై  మీడియాతో స్పందించారు. ఇతర భాషల‌లో హీరో హీరోయిన్స్ కి సమానమైన గుర్తింపు ఉంటుంది. కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఫిమేల్ యాక్టర్ కి కావలసిన గుర్తింపు మన టాలీవుడ్‌లో లభించదు.

archana veda sensational comments on tollywood heroes

పెళ్లి అయిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఎన్నో అడ్డంకుల‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న హీరోకి మాత్రం రెమ్యూనరేషన్ లో ఎటువంటి మార్పు ఉండదు. హీరోల రెమ్యూన‌రేషన్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. అదే పెళ్లి అయిన హీరోయిన్ కు మాత్రం రెమ్యూన‌రేషన్ తగ్గించుకోండి అంటూ దర్శక నిర్మాతలు డిమాండ్ చేస్తుంటారు. ఎందుకు ఇలా హీరో హీరోయిన్స్ మధ్య తేడాలు చూపిస్తారు అంటూ అర్చన ఘాటుగా ప్రశ్నించారు. రాబోయే కాలంలోనైనా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ కి మధ్య ఈ భేదం తొలగిపోవాలని ఆశిస్తున్నాను.. అంటూ అర్చన ఆవేదన వ్యక్తం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment