Archana : అలా చేసినందుకు ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతూనే ఉన్నాన‌న్న అర్చ‌న‌..!

April 24, 2022 9:34 AM

Archana : దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో రాజ‌మౌళి త‌ప్ప‌క ఉంటారు. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేశాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్‌తో స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పాడు. త్వ‌ర‌లో మ‌హేష్‌తో మూవీ చేయ‌నుండ‌గా, ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉన్న‌త స్థాయికి వెళుతున్న రాజ‌మౌళి సినిమాల‌లో న‌టించాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఎంత‌గానో ఆశ‌ప‌డ‌డం స‌హ‌జం. కానీ తెలుగు అమ్మాయి అర్చన శాస్త్రి వ‌చ్చిన ఆఫ‌ర్‌ని రిజెక్ట్ చేసిందట‌.

Archana feels sorry for rejecting Rajamouli movie
Archana

అర్చన మొదట వేద అనే పేరుతో ఇండస్ట్రీకి పరిచయమైంది. తపన అనే సినిమా ద్వారా మొట్టమొదట హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. అన్నపూర్ణమ్మ గారి మనవడు అనే సినిమాలో కూడా అర్చ‌న హీరోయిన్ గా నటించింది. అయితే అర్చ‌న‌కు హీరోయిన్‌గా క‌న్నా స‌పోర్టింగ్ క్యారెక్టర్స్‌కి సంబంధించి ఆఫ‌ర్స్ ఎక్కువ‌గా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో రాజ‌మౌళి తెర‌కెక్కించిన మ‌గ‌ధీర‌లో ముఖ్య‌మైన పాత్ర‌లో ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌.

ఓ కీలక పాత్ర కోసం సంప్రదించగా తాను హీరోయిన్ గానే సెటిల్ అవ్వాలని అర్చ‌న‌ ఆ సినిమాకు నో చెప్పింది. ఈ విషయాన్ని తాజాగా అర్చన ఇంటర్వ్యూలో వెల్లడించింది. మగధీర సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం తనను సంపాదించార‌ని తెలిపింది. కానీ తాను హీరోయిన్ గానే చేయాలని అనుకున్నట్టు తెలిపింది. సినిమా విడుద‌లై మంచి హిట్ సాధించిన త‌ర్వాత ఎందుకు న‌టించ‌లేదా అని బాధ‌ప‌డిన‌ట్టు చెప్పింది అర్చ‌న‌. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుండ‌గా, ఆ మ‌ధ్య బిగ్ బాస్ సీజ‌న్ 1లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లో అడుగుపెట్టింది. ఉన్న‌న్ని రోజులు బాగానే సంద‌డి చేసి అల‌రించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now