Anu Emmanuel : ఆ గొప్పింటి హీరోను పెళ్లాడ‌బోతున్న అను ఇమ్మాన్యుయెల్‌..?

Anu Emmanuel : మ‌జ్ను అనే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ.. అను ఇమ్మాన్యుయెల్‌. ఈమె కెరీర్ మ‌ళ‌యాళం ఇండ‌స్ట్రీతో మొద‌లైంది. ఆ త‌రువాత తెలుగులో ఈమెకు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఈమె అదృష్టం అంత బాగా ఏమీ లేద‌నే చెప్పాలి. యాక్ట్ చేసిన ఒక‌టి రెండు సినిమాలు త‌ప్ప పెద్ద‌గా ఈమెకు హిట్స్ లేవు. మ‌జ్ను త‌రువాత కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌, ఆక్సిజ‌న్‌, అజ్ఞాత‌వాసి, నా పేరు సూర్య వంటి చిత్రాల్లో న‌టించింది. కానీ ఇవేవీ హిట్‌ను అందించ‌లేదు. అయినప్ప‌టికీ ఈమెకు ఆఫ‌ర్లు మాత్రం త‌గ్గ‌లేదు.

ఇక గీత గోవిందంలో క్యారెక్ట‌ర్ చేసింది. కానీ ఇందులో ఆమెది ప్ర‌ధాన పాత్ర కాదు. అలాగే శైలజా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్‌, మ‌హా స‌ముద్రం వంటి చిత్రాల్లోనూ ఈమె న‌టించింది. కానీ అవి కూడా నిరాశ‌ప‌రిచాయి. దీంతో ఈమె సినిమా ఇండ‌స్ట్రీకి దాదాపుగా దూరం అయిన‌ట్లే క‌నిపిస్తోంది. అయితే ఈమె గ‌త కొంత కాలంగా అల్లు అర‌వింద్ రెండో కుమారుడు అల్లు శిరీష్‌ను ప్రేమిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రూ క‌ల‌సి దిగిన ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. దీంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నార‌ని కూడా అంటున్నారు.

Anu Emmanuel

అను ఇమ్మాన్యుయెల్‌, అల్లు శిరీష్‌లు క‌ల‌సి ఓ చిత్రంలోనూ న‌టిస్తున్నారు. ప్రేమ కాదంట‌లో వీరు యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చి చాలా రోజులే అవుతోంది. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీ గురించి త‌రువాతి అప్‌డేట్ ఏమిటో చెప్ప‌లేదు. దీంతో అస‌లు ఈ మూవీ షూటింగ్ కొన‌సాగుతుందా.. రిలీజ్ అవుతుందా.. అన్న అనుమానాలు వ‌స్తున్నాయి. అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో మాత్రం వీరు ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్నార‌ని వార్తుల వ‌స్తున్నాయి. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM