Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా అందరి చేత ప్రశంసలు పొందిన నాగ చైతన్య, సమంత ఈ ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఈ ఇద్దరూ ఎడముఖం పెడముఖం అన్నట్టుగానే ఉన్నారు. నాగ చైతన్య పుట్టిన రోజున విష్ చేయకపోవడం.. ఆ తరువాత వచ్చిన తన కుక్క పిల్ల పుట్టిన రోజున సమంత విష్ చేయడం.. ఆ తరువాత రానాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం వంటివి అక్కినేని అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశాయి.
ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరూ ఇలా విడిపోయి శత్రువులు మాదిరిగా ఉండడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న స్టార్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత ఇద్దరూ మనస్పర్దలతో విడిపోయినా వీరివురూ ఎక్కడా ఎందుకు విడిపోయామనే సంగతిని చెప్పనేలేదు. అయితే విడాకుల తర్వాత సమంత తనకు నచ్చినట్టుగా జీవిస్తోంది.
ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. విడాకుల తరువాత పెద్దగా బయట కనిపించని చైతూ.. బంగార్రాజు సినిమా షూటింగ్ టైంలో ఆయన పక్కన నటించిన లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టికి దగ్గరైన్నట్లు వార్తలు వస్తున్నాయి. కృతి శెట్టి కూడా చై తో చాలా సన్నిహితంగా మెలుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని కొందరు చెబుతుండగా, అది ఉట్టి పుకారేనని కొట్టిపారేసే వారు ఉన్నారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదు కదా అని అనే వాళ్లు కూడా ఉన్నారనుకోండి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది రానున్న రోజులలో తెలియనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…