Naga Chaitanya : చైతూ లైఫ్‌లోకి మ‌రో అమ్మాయి రాబోతుందా..?

December 31, 2021 4:15 PM

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా అంద‌రి చేత ప్ర‌శంస‌లు పొందిన నాగ చైత‌న్య‌, స‌మంత ఈ ఏడాది అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. విడాకుల త‌ర్వాత ఈ ఇద్ద‌రూ ఎడ‌ముఖం పెడ‌ముఖం అన్న‌ట్టుగానే ఉన్నారు. నాగ చైతన్య పుట్టిన రోజున విష్ చేయకపోవడం.. ఆ తరువాత వచ్చిన తన కుక్క పిల్ల పుట్టిన రోజున స‌మంత‌ విష్ చేయడం.. ఆ తరువాత రానాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం వంటివి అక్కినేని అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశాయి.

another girl entering into Naga Chaitanya  life

ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఇద్ద‌రూ ఇలా విడిపోయి శత్రువులు మాదిరిగా ఉండ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప్రేమించి, పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్న స్టార్స్ అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత ఇద్ద‌రూ మ‌న‌స్ప‌ర్ద‌ల‌తో విడిపోయినా వీరివురూ ఎక్క‌డా ఎందుకు విడిపోయామ‌నే సంగ‌తిని చెప్ప‌నేలేదు. అయితే విడాకుల త‌ర్వాత స‌మంత త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా జీవిస్తోంది.

ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. విడాకుల తరువాత పెద్దగా బయట కనిపించని చైతూ.. బంగార్రాజు సినిమా షూటింగ్ టైంలో ఆయన పక్కన నటించిన లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టికి దగ్గరైన్నట్లు వార్తలు వస్తున్నాయి. కృతి శెట్టి కూడా చై తో చాలా స‌న్నిహితంగా మెలుగుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని కొందరు చెబుతుండ‌గా, అది ఉట్టి పుకారేన‌ని కొట్టిపారేసే వారు ఉన్నారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదు క‌దా అని అనే వాళ్లు కూడా ఉన్నార‌నుకోండి. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది రానున్న రోజుల‌లో తెలియనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now