Anjali : బాల‌కృష్ణ‌కు అంజ‌లి వెన్నుపోటు.. అస‌లు విష‌యం ఏమిటి..?

June 6, 2022 10:36 AM

Anjali : అనేక సినిమాల్లో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న న‌టి అంజ‌లి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. త‌రువాత కోలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌రువాత ఫొటో అనే మూవీ ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. అనంత‌రం షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు.. త‌దిత‌ర చిత్రాల‌తో పాపుల‌ర్ అయింది. అయితే ప్ర‌స్తుతం అంజ‌లికి పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. అయితే ఈమె బాల‌కృష్ణ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

అఖండ త‌రువాత బాల‌కృష్ణ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీని చేస్తున్న విష‌యం విదిత‌మే. ఎన్‌బీకే 107 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ ప‌నులు కొన‌సాగిస్తున్నారు. అయితే ఈ మూవీ అనంత‌రం బాల‌కృష్ణ అనిల్ రావిపూడితో ఓ మూవీని చేయ‌నున్నారు. అందులో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యంలో అలరించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అందులో బాల‌కృష్ణ‌కు కూతురిగా శ్రీ‌లీల న‌టించ‌నుంది.

Anjali to act in Balakrishna movie
Anjali

అనిల్ రావిపూడితో తీయ‌బోయే సినిమాను ఎన్‌బీకే 108 వ‌ర్కింగ్ టైటిల్‌తో పూర్తి చేయ‌నున్నారు. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇందులో బాల‌య్య‌కు భార్య‌గా ప్రియ‌మ‌ణి న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ఇదే మూవీలో అంజ‌లి కూడా న‌టిస్తుంద‌ట‌. కానీ ఈమె అందులో నెగెటివ్ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బాల‌య్య‌ను న‌మ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచే క్యారెక్ట‌ర్‌లో అంజ‌లి న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now