ష‌ర్మిల పార్టీపై ప‌రోక్షంగా స్పందించిన సీఎం జ‌గ‌న్.. ఏమ‌న్నారంటే..?

July 8, 2021 10:05 PM

దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌య వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో ఓ నూత‌న రాజ‌కీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ జ‌యంతి రోజున ఆమె పార్టీని ప్ర‌క‌టించారు. ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న స‌మాధి వ‌ద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థ‌న‌లు చేశారు. వైఎస్‌కు నివాళులు అర్పించిన అనంత‌రం ఆమె హైద‌రాబాద్‌కు వ‌చ్చి అధికారికంగా పార్టీ పేరును, జెండాను ఆవిష్క‌రించారు.

what ys jagan said about sharmila party

అయితే ష‌ర్మిల రాజ‌కీయ పార్టీపై ఆమె సోద‌రుడు, సీఎం వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న జ‌ల‌వివాదాల‌పై జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. తాము పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉండాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు.

ఇత‌ర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్ట‌డం త‌మ‌కు ఇష్టం లేద‌ని జ‌గ‌న్ అన్నారు. ష‌ర్మిల పార్టీపైనే ఆయ‌న ఈ విధంగా వ్యాఖ్య‌లు చేశార‌ని మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. రేపు ఎవ‌రైనా ష‌ర్మిల పార్టీ గురించి సీఎం జ‌గ‌న్‌ను అడిగితే అప్పుడు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు రాకుండా ఉండాల‌నే జ‌గ‌న్ ఇప్పుడు ఈ విధంగా అని ఉంటార‌ని, దీంతో ఇక‌పై ఎవ‌రూ ఆ విష‌యాన్ని ఆయ‌న వ‌ద్ద ప్ర‌స్తావ‌న‌కు తేకుండా ఉంటార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now