ఆంధ్ర‌ప్ర‌దేశ్

తిరుప‌తి ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజ‌యం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీకి రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే అత్య‌ధిక స్థానాల‌ను ప్ర‌జ‌లు వైకాపాకు క‌ట్ట‌బెట్టారు. దీంతో జ‌గ‌న్ సీఎం అయ్యారు. అంతేకాదు, ఆయన పాద‌యాత్ర‌లో, ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్దానాల‌ను కూడా పూర్తి చేస్తున్నారు. దీంతో ఏ ఎన్నిక‌ల్లో అయినా స‌రే వైకాపా విజ‌య దుందుభి మోగిస్తూనే వ‌స్తోంది. ఇక ఇటీవ‌ల తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జరిగిన విష‌యం విదిత‌మే. కాగా ఆ ఎన్నిక‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలో వైసీపీ త‌న సీటును మ‌ళ్లీ సొంతం చేసుకుంటుంద‌ని అన్ని ఎగ్జిట్స్ పోల్స్ తేల్చి చెప్పాయి.

తిరుప‌తి లోక్‌స‌భ సిట్టింగ్ స్థానాన్ని వైకాపా మ‌ళ్లీ సొంతం చేసుకుంటుంద‌ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ క్ర‌మంలోనే ఆరా ఎగ్జిట్ పోల్స్‌లో వైకాపాకు 65.85 శాతం, టీడీపీకి 23.10 శాతం, బీజేపీకి 7.34 శాతం ఓట్లు వ‌స్తాయని తెలిపారు. అయితే తుది ఫ‌లితాల‌కు 2 నుంచి 3 శాతం వ‌ర‌కు తేడా ఉండేందుకు అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు.

ఇక ఆత్మ సాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం కూడా వైకాపాకే సీటు వ‌స్తుంద‌ని వెల్ల‌డైంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం వైకాపాకు 59.25 శాతం, టీడీపీకి 31.25 శాతం, బీజేపీకి 7.5 శాతం వ‌ర‌కు ఓట్లు రావ‌చ్చ‌ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. ఈ క్ర‌మంలో ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తే వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి తిరుప‌తి ఎంపీగా విజ‌యం సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఉప ఎన్నిక ఫ‌లితాలు మే 2వ తేదీన వెలువ‌డుతాయి క‌నుక అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM