భార్యా భర్తల మధ్య అనుబంధం ఎంతో గొప్పదని చెబుతారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఒకరి కోసం ఒకరు బతుకుతుంటారు. అయితే తుని మండలం కొత్తసూరవరంలో దంపతులు మృత్యువులో కూడా ఆ బంధాన్ని వీడలేదు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కర్ర త్రిమూర్తులు, రామలక్ష్మి దంపతులు శుక్రవారం ఉదయం ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
వీరిద్దరూ గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంత కాలంగా త్రిమూర్తులు అనారోగ్యంతో బాధపడుతుండగా రామలక్ష్మి కూడా కాలు విరిగి మంచానికే పరిమితం అయింది. ఈ సమయంలోనే శుక్రవారం ఉదయం త్రిమూర్తులు తన భార్య కోసం టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు.
ఇలా బయటకు వెళ్లిన త్రిమూర్తులు బయటికి వెళ్లిన చోటే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని ఇంటికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో అతని భార్య రామలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురై షాక్‌తో ప్రాణాలను కోల్పోయింది. ఈ విధంగా ఒకేసారి ఈ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ దంపతులకి వివాహం జరిగి 35 సంవత్సరాలు అయినప్పటికీ వీరికి పిల్లలు లేరు. దీంతో వీరి అంతిమ సంస్కారాలను బంధువులు నిర్వహించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…