తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే నువ్వా నేనా అంటూ తీవ్ర స్థాయిలో అభ్యర్థులు మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవికి అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మా ఎన్నికల నోటిఫికేషన్ ను అధికారికంగా విడుదల చేశారు. అక్టోబర్ 10వ తేదీ ఆదివారం ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్ ప్రభుత్వ పాఠశాలలో జరగనున్నట్లు నోటిఫికేషన్ లో వెలువరించారు. అలాగే ఎన్నికల జరిగిన రోజే ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంటుందని ఎన్నికల అధికారి వి. కృష్ణమోహన్ తెలియజేశారు.
8 మంది ఆఫీస్ బేరర్స్, 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్ లతో కూడిన కమిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎన్నికల నిబంధనలు నియమాల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 30వ తేదీ నామినేషన్ల పరిశీలన, నామినేషన్లను ఉపసంహరణ కోసం అక్టోబర్ 1-2 వ తేదీలలో సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది.
ఉపసంహరణ గడువు తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగగా అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఎన్నికల ఫలితాలను తెలియజేయనున్నారు. ఇక ఈ ఎన్నికలలో భాగంగా నియమ నిబంధనల విషయానికి వస్తే ఒక పోస్టుకు కేవలం ఒక అభ్యర్థి మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగులకు హాజరు కానివారు ఈ పోటీలకు అర్హత కోల్పోతారు.
24 క్రాఫ్ట్స్ లో ఆఫీస్ బేరర్స్‌గా ఉన్నవారు రాజీనామా చేస్తేనే ఈ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించింది. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ నియమ నిబంధనలను విడుదల చేయగా.. ఇప్పటికే ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహ రావు ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…