మృత్యువులోనూ వీడని బంధం.. భర్త మరణించిన గంటకే భార్య మరణం..

September 18, 2021 7:47 PM

భార్యా భర్తల మధ్య అనుబంధం ఎంతో గొప్పదని చెబుతారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఒకరి కోసం ఒకరు బతుకుతుంటారు. అయితే తుని మండలం కొత్తసూరవరంలో దంపతులు మృత్యువులో కూడా ఆ బంధాన్ని వీడలేదు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కర్ర త్రిమూర్తులు, రామలక్ష్మి దంపతులు శుక్రవారం ఉదయం ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మృత్యువులోనూ వీడని బంధం.. భర్త మరణించిన గంటకే భార్య మరణం..

వీరిద్దరూ గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంత కాలంగా త్రిమూర్తులు అనారోగ్యంతో బాధపడుతుండగా రామలక్ష్మి కూడా కాలు విరిగి మంచానికే పరిమితం అయింది. ఈ సమయంలోనే శుక్రవారం ఉదయం త్రిమూర్తులు తన భార్య కోసం టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు.

ఇలా బయటకు వెళ్లిన త్రిమూర్తులు బయటికి వెళ్లిన చోటే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని ఇంటికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో అతని భార్య రామలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురై షాక్‌తో ప్రాణాలను కోల్పోయింది. ఈ విధంగా ఒకేసారి ఈ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ దంపతులకి వివాహం జరిగి 35 సంవత్సరాలు అయినప్పటికీ వీరికి పిల్లలు లేరు. దీంతో వీరి అంతిమ సంస్కారాలను బంధువులు నిర్వహించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now