వీర‌మాచ‌నేనికి గౌరవ డాక్ట‌రేట్ ప్ర‌దానం.. విమ‌ర్శించిన బాబు గోగినేని..

August 28, 2021 6:02 PM

ఒక‌ప్పుడు కొవ్వు ప‌దార్థాల డైట్‌ను పాటించాల‌ని చెప్పి ఫేమ‌స్ అయిన వీర‌మాచ‌నేని గుర్తున్నారు క‌దా. ఎన్నో వ్యాధుల‌ను కేవ‌లం డైట్ తోనే త‌గ్గించుకోవ‌చ్చ‌ని ఆయ‌న ప్ర‌యోగాత్మ‌కంగా నిరూపించారు. ఎంతో మంది ఆయ‌న డైట్‌ను పాటించి అనారోగ్యాల‌ను త‌గ్గించుకున్నారు. అయితే ఆయన‌కు గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ యూనివ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌ను ప్ర‌దానం చేసింది.

వీర‌మాచ‌నేనికి గౌరవ డాక్ట‌రేట్ ప్ర‌దానం.. విమ‌ర్శించిన బాబు గోగినేని..

డైట్‌కు సంబంధించి వీర‌మాచ‌నేని చేసిన కృషికి గాను విజ్ఞాన్ యూనివ‌ర్సిటీ ఆయ‌న‌కు డాక్ట‌రేట్‌ను ఇచ్చింది. అయితే దీనిపై ప్ర‌ముఖ హేతువాది బాబు గోగినేని విమ‌ర్శ‌లు చేశారు. డాక్ట‌రేట్‌ను ఎవ‌రికి ప‌డితే వారికి ఎలా ఇస్తారు ? అస‌లు ఆయ‌న‌కు ఉన్న అర్హ‌త ఏమిటి ? సైన్స్‌ను త‌ప్పు ప‌ట్టే వారికి డాక్ట‌రేట్‌ల‌ను ఎలా ప్ర‌దానం చేస్తారు ? డాక్ట‌రేట్ ఇచ్చే ముందు రూల్స్ చెక్ చేశారా ? యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఏం చెబుతోంది ? డీమ్డ్‌ వర్సిటీలకు ఉన్న డైరెక్షన్స్‌ ఏంటి ? అంటూ బాబు గోగినేని విమ‌ర్శించారు.

కరోనాకు వంటింటి పోపుల డబ్బా పరిష్కారం అన్నావు. మరి వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నావు, మాస్క్‌ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదన్న వ్యక్తి స్పుత్నిక్‌ వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నట్లు.. అని గోగినేని ప్రశ్నించారు. వీరమాచనేని చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అంటూ గోగినేని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ కరోనా సూచనలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే రామకృష్ణకు డాక్టరేట్ ను ఎలా ఇస్తారు, గౌరవ డాక్ట‌రేట్‌ల‌కు ఉన్న గౌర‌వాన్ని త‌గ్గించారు.. అంటూ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

అయితే దీనిపై వీర‌మాచ‌నేని స్పందించారు. నిజాన్ని ఎదుర్కొలేని వారే తప్పు కౌంటర్లు వేస్తున్నార‌ని అన్నారు. అప్ప‌ట్లో తాను చెప్పిన మాట‌ల‌కు ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డే ఉన్నాన‌న్నారు. ఇంగ్లిష్ మందుల‌తో డ‌యాబెటిస్ త‌గ్గ‌న‌ప్పుడు మందుల‌ను ఎందుకు ఇస్తున్నార‌ని అన్నారు. త‌న డైట్‌తో చాలా మందికి డ‌యాబెటిస్ త‌గ్గింద‌న్నారు. ఆ విష‌యంలో ఎవ‌రితోనైనా తాను చాలెంజ్‌కి రెడీ అని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now