బీరువాలో వింత శబ్దాలు.. భయంతో బీరువా తెరిచి చూసి షాకైన అధికారులు..!

September 12, 2021 11:33 PM

అది స్థానికంగా ఉన్నటువంటి ఒక జూనియర్ కళాశాల. ఎప్పటిలాగే సిబ్బంది కళాశాలకు హాజరై వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే కళాశాల ప్రిన్సిపల్ ఆఫీస్ రికార్డ్స్ అడగడంతో బీరువా దగ్గరకు వెళ్ళిన అటెండర్ కు ఊహించని షాక్ తగిలింది. అప్పటికే బీరువాలో నుంచి వింత శబ్దాలు రావడంతో పెద్దగా పట్టించుకోని అతను ఒక్కసారిగా రికార్డుల కోసం బీరువా తెరిచి చూడటంతో గట్టిగా అరుస్తూ పరుగులు తీశాడు. బీరువాలో బుసలు కొడుతూ తాచుపాము ఉండటంతో భయంతో అటెండర్ బయటకు పరుగులు పెట్టాడు.

బీరువాలో వింత శబ్దాలు.. భయంతో బీరువా తెరిచి చూసి షాకైన అధికారులు..!

ఈ  ఘటన ఆంధ్ర ప్రదేశ్ జిల్లా విజయనగరంలోని గణపతి నగర్ లో ఉన్న జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. ఈ ఘటన గత రెండు రోజుల క్రితం జరగడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఆమడదూరంలో ఉన్న పాములు చూస్తేనే భయంతో పరుగులు పెడతాం. అలాంటిది ఎదురుగా కనిపిస్తే ప్రాణం పోయినంత పని అవుతుంది.

ఇలాంటి ఘటన కళాశాల అటెండర్ కు చోటు చేసుకోవడంతో అతడు వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై వెంటనే ఈ సమాచారాన్ని స్నేక్ స్నాచర్స్ కు తెలియజేయడంతో వారు కాలేజీకి చేరుకుని ఎంతో చాకచక్యంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో ఆ పామును వదిలి పెట్టారు. కాగా కాలేజీ బీరువాలో తాచు పాము ఉండడంతో అధికారులు షాక్‌ తిన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now