అప్పుడు వైఎస్సార్‌.. ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్‌.. బ్యాటుతో అలరించారు..!

July 9, 2021 9:37 PM

దివంగ‌త ముఖ్య‌మంత్రి, మ‌హా నాయ‌కుడు వైఎస్సార్ అప్ప‌ట్లో ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల‌తో ఎంత‌టి ప్ర‌జాద‌ర‌ణ‌ను చూర‌గొన్నారో అంద‌రికీ తెలిసిందే. ఆయన ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయి. ఆయ‌న అడుగు జాడ‌ల్లోనే ప్ర‌స్తుతం ఆయ‌న త‌న‌యుడు సీఎం జ‌గ‌న్ న‌డుస్తున్నారు. అప్ప‌ట్లో వైఎస్సార్ ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌నే జ‌గ‌న్ ఇప్పుడు అమ‌లు చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వైఎస్సార్ ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇప్ప‌టికీ ప్ర‌శంసిస్తుంటారు.

cm jagan cricket video viral

అయితే అప్ప‌ట్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి వెళ్లిన‌ప్పుడు వైఎస్సార్ బ్యాట్ చేత‌ప‌ట్టి క్రికెట్ ఆడారు. షాట్లు కొడుతూ అల‌రించారు. ఇక ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు సీఎం జ‌గ‌న్ కూడా అలాగే బ్యాట్‌తో క్రికెట్ ఆడారు. షాట్లు కొడుతూ ఆక‌ట్టుకున్నారు.

సీఎం వైఎస్ జ‌గ‌న్ తాజా క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఫ్ల‌డ్ లైట్ల ప‌నుల‌ను ప్రారంభించారు. అనంత‌రం జ‌గ‌న్ కాసేపు క్రికెట్ ఆడి అల‌రించారు. దీంతో అప్పుడు వైఎస్ఆర్‌, ఇప్పుడు జ‌గ‌న్ అభిమానుల‌ను అల‌రించారు.. అంటూ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ క్రికెట్ ఆడిన వీడియో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now