ఆంధ్ర‌ప్ర‌దేశ్

సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ.. తిరుమల ‘సిట్’ రిపోర్ట్, నామినేటెడ్ పదవులపైనే చర్చ?

కీలక రాజకీయ అంశాలపై చర్చిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్. Photo Credit: Chandra Babu Naidu/X.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖి భేటీగా దాదాపు రెండు గంటల పాటు కీలక అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ భేటీలో ఏమేం అంశాలు చర్చకు వచ్చాయన్నది అధికారికంగా వెల్లడి కాలేకపోయినా, తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) చార్జిషీట్ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్రిక్తతలకు పాల్పడే ప్రయత్నాలను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఇద్దరు నేతలు వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది.

నామినేటెడ్ ప‌ద‌వుల‌పై చ‌ర్చ‌..?

అలాగే ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. వచ్చే నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో జనసేన పార్టీకి ఒక సీటు కేటాయించాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడిని కోరినట్టు తెలిసింది. ఇదే కాకుండా నామినేటెడ్ పదవులు, కీలక నియామకాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. కూటమి ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కొంతమంది నేతల ప్రవర్తనపై ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

అనంతపురం జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అలాగే అక్కడి టీడీపీ నేతల మధ్య నెలకొన్న పరిస్థితులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కీలక పరిణామాలకు సంకేతంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM