దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఇది ఒకే భాగంగా విడుదల కానుందని రాజమౌళి స్పష్టం చేశారు. నవంబర్ 2025లో హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారణాసి టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ఈ వేడుకకు హాజరైన అంతర్జాతీయ మీడియాతో రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలపై ఇటీవల ఎంబార్గో ఎత్తివేయడంతో, చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సందర్భంగా కథ రెండు భాగాలుగా అవసరమా? అన్న ప్రశ్నకు స్పందించిన రాజమౌళి, చిత్రాన్ని రెండు భాగాలుగా ఆలోచించినప్పటికీ, చివరికి సింగిల్ ఫిల్మ్ గానే నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఈ చిత్ర నిడివి సుమారు మూడు గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుందని వెల్లడించారు. తన కథన శైలితో ఈ పొడవునా ప్రేక్షకుల ఆసక్తిని నిలుపుతానన్న ధీమాను రాజమౌళి వ్యక్తం చేశారు. కాగా వారణాసి సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుత కాలానికి చెందిన రుద్రగా, అలాగే శ్రీరాముడిగా. ప్రియాంకా చోప్రా మందాకినిగా నటిస్తుండగా, వీల్‌చైర్‌లో కనిపించే బలమైన ప్రతినాయక పాత్ర కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
భారీ స్థాయి నిర్మాణ విలువలతో పౌరాణికత, కాలయానం, యాక్షన్ అడ్వెంచర్‌ల మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఆరు పాటలు చిత్రానికి మరింత ఆకర్షణను అందించనున్నాయి.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…