పెళ్లికి అతిథిలా వచ్చిన కరోనా..పీటల మీద పెళ్లి పెటాకులు.. తీరా చూస్తే?

May 8, 2021 2:11 PM

పెళ్లి పీటలపై కూర్చుని కొన్ని నిమిషాలలో మూడుముళ్ల బంధంతో ఒకటి కావాల్సిన ఆ జంటను కరోనా విడదీసింది. మూడు ముళ్ళు పడి, ఏడడుగులు నడవాల్సిన ఆజంట కరోనా దెబ్బకు ఎక్కడివారక్కడ పరుగులు పెట్టారు. ఈ విచిత్ర ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన అబ్బాయికి ముదిగుబ్బకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయించారు.అనుకున్న సమయానికి పెళ్లి వేడుకలు మొదలై తీవ్ర పెళ్లి జరిగే సమయంలో పెళ్లికూతురు తనకు ఇష్టం లేదని మొండి పట్టుపట్టింది.

తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని,తనకు కరోనా పాజిటివ్ అని చెబుతున్నా వినకుండా పెళ్ళికి ఏర్పాట్లు చేయడంతో ఈ విషయం కాస్త పోలీసుల వరకు చేరింది. కరోనాను అడ్డుపెట్టుకొని ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడమే కాకుండా పెళ్లికొడుకు వారు తమను తన కూతురిని బెదిరిస్తున్నారని పెళ్లి కూతురు పోలీసుల ఎదుట తెలిపింది.

మరో వైపు పెళ్ళికొడుకు నుంచి మూడు లక్షల నగదు, బంగారం తీసుకున్నారని డబ్బు ఆశతోనే పెళ్లికి ఒప్పుకోవడం లేదని పెళ్ళికొడుకు అంటున్నారు. పెళ్లికూతురు ఇష్టప్రకారమే పెళ్లికి ఒప్పుకున్నట్లు మధ్యవర్తులు చెబుతున్నారు. మొదట్లో డబ్బులు తీసుకొని తీరా పెళ్లి సమయానికి ఈ విధంగా అడ్డుపడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కదిరి టౌన్ ఎస్సై మహ్మద్ రఫీ చెప్పడంతో ఇరువురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి కరోనా ఆ జంట ను విడదీసిందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now