క‌రోనా సోకి చ‌నిపోతామేమోన‌ని బ‌య‌ట‌కు రాలేదు.. 15 నెల‌లుగా న‌లుగురు కుటుంబ స‌భ్యులు ఇంట్లోనే..!

July 23, 2021 2:42 PM

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మందిని బ‌లి తీసుకున్న క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్ల కొంద‌రు విప‌రీత‌మైన భ‌యాందోళ‌న‌లకు గుర‌వుతున్నారు. బ‌య‌ట‌కు వ‌స్తే ఎక్క‌డ కోవిడ్ సోకి చ‌నిపోతామేమోన‌ని ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట పెట్ట‌డం లేదు. స‌రిగ్గా ఆ న‌లుగురు కుటుంబ స‌భ్యులు కూడా ఇలాగే చేశారు. కానీ ఎట్ట‌కేల‌కు పోలీసులు వ‌చ్చి వారిని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి ర‌క్షించారు. వివ‌రాల్లోకి వెళితే..

a family of four not step out side because of covid fear

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని క‌డ‌లి అనే గ్రామంలో గురునాథ్‌, రుత్త‌మ్మ‌, కాంత‌మ‌ణి, రాణి అనే న‌లుగురు కుటుంబ స‌భ్యులు గ‌త 15 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. కాగా ఓ గ్రామ వాలంటీర్ తాజాగా వారి ఇంటికి వ‌చ్చి వారికి ప్రభుత్వ ప‌థ‌కం ప్ర‌కారం ఇంటి ప్లాట్ అలాట్ అయింద‌ని, వేలిముద్ర వేయాల‌ని కోరాడు. అయిన‌ప్ప‌టికీ వారు బ‌య‌టకు రాలేదు. అలా వారు ఎవ‌రు వ‌చ్చి పిలిచినా బ‌య‌ట‌కు రాలేదు. అలాగే ఇంట్లోనే ఉన్నారు.

అయితే ఆ వాలంటీర్ పోలీసుల‌కు స‌మాచారం అందింగా వారు వ‌చ్చి ఆ కుటుంబ స‌భ్యుల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. వారు న‌లుగురూ తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్న‌ట్లు గుర్తించారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఇంకొన్ని రోజులు వాళ్లు అలాగే ఉంటే చ‌నిపోయేవార‌ని పోలీసులు తెలిపారు. వారి ఇంటి ప‌క్క‌న ఓ కుటుంబంలో ఓ వ్య‌క్తి అప్ప‌ట్లో కోవిడ్ వ‌ల్ల చ‌నిపోయాడ‌ని, అందుక‌నే అప్ప‌టి నుంచి వారు భ‌య‌ప‌డి ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేద‌ని పోలీసులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now