Anchor Suma : దాదాపుగా 8 ఏళ్ల తర్వాత వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది యాంకర్ సుమ. ఇన్నాళ్లూ తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులని అలరించిన సుమ ఇప్పుడు వెండితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధమైంది. రీసెంట్‌గా తనను సినిమా చేయమని అడుగుతున్నారని, చేసేస్తే పోలా అని చెప్పిన సుమ తన రీఎంట్రీ మూవీ ఫస్ట్ లుక్‌ని రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయించింది.
వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పోస్టర్‌లో సుమ పల్లెటూరిలో ఊరి పెద్దగా కనిపించింది. ఇక చుట్టూ వేర్వేరు కథలను చూపించారు. గ్రామంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా జయమ్మ పంచాయితీకి రావాల్సిందే.. అన్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
”సుమ గారూ.. ప్రతి తెలుగు ఇంట్లో అత్యంత ఇష్టపడే పేరు. ఇప్పుడు 70ఎంఎం స్క్రీన్ పైకి వచ్చేస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని చరణ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. సినిమాకి విజయ్ కుమార్ కలివరపు కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. విజయలక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే ఓ సినిమాలో హీరోయిన్‌గా చేసిన సుమ.. మళ్ళీ ఇన్నేళ్లకు ఇంత స్ట్రాంగ్ రోల్‌తో రీ- ఎంట్రీ ఇస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొల్పుతోందని చెప్పవచ్చు.
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…