Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి సమంత. తన అందం, నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత మళ్లీ వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే సమంత ఓ ఉద్దేశంతో ఓ మాట చెప్పేసింది. ఇంతకు అదేంటో చూద్దాం.
సమంత.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సమంత మరింత క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఏం జరిగిందో తెలియదు గానీ ఇటీవలే నాగచైతన్యను వీడిపోయింది. మళ్లీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. కానీ ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఇక ఈ మధ్య తన సోషల్ మీడియా వేదికగా కొన్ని సూక్తులు, జీవితానికి సంబంధించిన విషయాలను తెలుపుతోంది.
తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ కొటేషన్ ను షేర్ చేసింది. అందులో.. ఈ ఏడాది దీపాలు వెలిగించని ఇల్లు.. స్వీట్లు కూడా రుచిని కోల్పోయినట్టుగా అనిపించడం.. అంటూ ఏడాది ప్రారంభంలో చాలామందికి నష్టాలు కలిగాయని కాబట్టి.. అలాంటి వారందరికీ ఈ పండుగ చాలా చిన్నగా అనిపిస్తుందని.. అందుకే త్వరలోనే సంతోషాలు ఉంటాయని.. ఓ కొటేషన్‌ను పంచుకుంది. సమంత కూడా ఈ ఏడాది నాగచైతన్య కు బ్రేక్ అప్ చెప్పటంతో కాస్త బాధలో ఉన్నట్లు అర్థమైంది. అందుకే వాటిని మర్చిపోయి కొత్త సంతోషాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఈ విధంగా కొటేషన్‌ను పెట్టినట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా.. ఆమె ఈ విధంగా కొటేషన్‌లు షేర్ చేస్తుందంటే.. ఎంత బాధలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…