Anchor Suma : జయమ్మ పంచాయితీ.. పోస్టర్‌తోనే సుమ అదరగొట్టేసిందిగా..!

November 6, 2021 9:34 PM

Anchor Suma : దాదాపుగా 8 ఏళ్ల త‌ర్వాత వెండితెర‌కు రీ ఎంట్రీ ఇస్తోంది యాంక‌ర్ సుమ‌. ఇన్నాళ్లూ త‌న మాట‌ల‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన సుమ ఇప్పుడు వెండితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేందుకు సిద్ధ‌మైంది. రీసెంట్‌గా త‌న‌ను సినిమా చేయ‌మ‌ని అడుగుతున్నార‌ని, చేసేస్తే పోలా అని చెప్పిన సుమ త‌న రీఎంట్రీ మూవీ ఫ‌స్ట్ లుక్‌ని రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా విడుద‌ల చేయించింది.

Anchor Suma stunning first look from jayamma panchayithi

వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రూపొంద‌నున్న చిత్రానికి ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పోస్టర్‌లో సుమ పల్లెటూరిలో ఊరి పెద్దగా కనిపించింది. ఇక చుట్టూ వేర్వేరు కథలను చూపించారు. గ్రామంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా జయమ్మ పంచాయితీకి రావాల్సిందే.. అన్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

”సుమ గారూ.. ప్రతి తెలుగు ఇంట్లో అత్యంత ఇష్టపడే పేరు. ఇప్పుడు 70ఎంఎం స్క్రీన్ పైకి వచ్చేస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని చరణ్ త‌న ట్వీట్ లో రాసుకొచ్చారు. సినిమాకి విజయ్ కుమార్ కలివరపు కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. విజయలక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే ఓ సినిమాలో హీరోయిన్‌గా చేసిన సుమ.. మళ్ళీ ఇన్నేళ్లకు ఇంత స్ట్రాంగ్ రోల్‌తో రీ- ఎంట్రీ ఇస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొల్పుతోందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment