Sreemukhi : వర్షాకాలంలో సహజంగానే వర్షాలు బాగా పడుతుంటాయి. కొన్నిసార్లు తుఫాన్, రుతు పవనాలు కలసి భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం జరుగుతున్నది అదే. గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి. సూర్యుడు రాక దాదాపు వారం రోజులు అవుతోంది. ఈ క్రమంలోనే రహదారులు ఎక్కడ చూసినా జలమయంగా మారాయి. అలాగే నేల అంతా చిత్తడిగా బురదమయంగా మారింది. దీంతో అలాంటి బురదలో నడవాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. అది సహజమే కానీ.. రైతులు నిత్యం అదే బురదలో పనిచేస్తుంటారు. దేశానికి కావల్సిన తిండి గింజలను పండిస్తుంటారు.
ఈ క్రమంలోనే రైతులు వర్షాల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కనుక వర్షాలు పడితే ఆనందం వ్యక్తం చేయాలి. అంతేకానీ వర్షాన్ని తిట్టకూడదు. అలా తిడితే మనకు వచ్చే తిండిని తిట్టినట్లే అవుతుంది. ఇంత చిన్న లాజిక్ తెలియని శ్రీముఖి వర్షాన్ని తిట్టేసింది. తొక్కలో వర్షం అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. వాస్తవానికి ఆమె వెళ్తున్నది కారులో.. నడిచి కాదు.. అంతమాత్రాన వర్షాన్ని నిందించడం ఎందుకు ? ఈ క్రమంలోనే శ్రీముఖిని నెటిజన్లు సైతం ట్రోల్ చేస్తున్నారు. నువ్వు వర్షాన్ని తిడుతున్నావు.. మరి తిండి మనకు ఎక్కడి నుంచి వస్తుంది.. అని శ్రీముఖిని ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియా చేతిలో ఉంది కదా.. అని ఏ పోస్టులు పెడితే ఆ పోస్టులకు నెటిజన్లు లైకులు కొడతారు అనుకుంటే పొరపాటు. సోషల్ మీడియా దెబ్బకు ప్రస్తుతం బడా బడా నేతల కుర్చీలే కదిలిపోతున్నాయి. దాన్ని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటే ఓకే. కానీ సమాజంలో ప్రజల మనోభావాలు దెబ్బ తినేవిధంగా.. అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం ఎందుకు.. వారితో తిట్టించుకోవడం ఎందుకు.. ఇదంతా అవసరమా.. శ్రీముఖి ఆలోచిస్తుంది కాబోలు..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…