Bigg Boss 5 : కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ లో భాగంగా ఏ రాజకుమారుడి దగ్గర ఎక్కువ నాణేలు ఉంటే వారు కెప్టెన్సీగా ఎన్నిక అవుతారని బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాణేలు లెక్క పెట్టాల్సిన బాధ్యత బిగ్ బాస్ కెప్టెన్ శ్రీ రామ్ కి చెప్పాడు. అయితే చివరికి నాణేలు కాకుండా ఎవరివైపు ఎక్కువమంది ప్రజలు ఉంటే వారే రాజ్యానికి రాజు అని ప్రకటించడంతో యాంకర్ రవి పక్కన ఏడుగురు ఉంటే సన్ని వైపు 6 మంది ఉండడం చేత రవిని నియమించారు.
ఈ క్రమంలోనే రవి గెలుపొందడంతో రవి గ్రూప్ లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్ లను కెప్టెన్సీ టాస్క్ కోసం నియమించాలని బిగ్ బాస్ చూపించాడు. అందుకు రవి.. హమీద, శ్వేత, అనీ మాస్టర్ పేర్లను తెలియజేశారు. అయితే కెప్టెన్సీ టాస్క్ కి అనర్హులుగా ప్రకటించిన ప్రియకు బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసి తాను కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశం ఇచ్చాడు. అయితే రవి చెప్పిన వారిలో ఎవరో ఒకరు కెప్టెన్సీ టాస్క్ నుంచి వెను తిరిగితే వారి స్థానంలో ప్రియ ఉంటుంది.
ఈ క్రమంలోనే హమీద కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకోవడంతో ప్రియ కెప్టెన్సీ టాస్క్ రేసులో ఉన్నారు. మరి నేడు జరగబోయే ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ పది వేళ్లు సరిపోవు సోదరా అనే టాస్క్ ఇచ్చారు. నాలుగు వాటర్ డ్రమ్ములు ఇచ్చి వాటి చుట్టూ హోల్స్ పెట్టారు. అయితే బజర్ మోగినప్పుడు హోల్స్ కి ఉన్న ప్లాస్టిక్ స్టిక్కర్ తీసేసి టాస్క్ పూర్తయ్యేలోగా ఎవరి వాటర్ డ్రమ్ములో ఎక్కువ నీళ్ళు ఉంటే వారే కెప్టెన్సీ అని తెలియజేశారు. మరి ఈవారం కెప్టెన్‌గా ఎవరు గెలుస్తారు.. అనేది తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…