Anchor Jhansi : వారి అతి చాలా ఎక్కువైంది.. మా జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు.. ఝాన్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

February 8, 2022 6:18 PM

Anchor Jhansi : బుల్లితెర‌తోపాటు వెండితెర‌పై కూడా ప‌లు పాత్ర‌ల్లో న‌టించి న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంక‌ర్ల‌లో.. సీనియర్ యాంక‌ర్ ఝాన్సీ కూడా ఒక‌రు. ఈమె ప్ర‌స్తుతం ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు ఈమె ఉద‌య‌భాను, సుమ‌తోపాటు టీవీల్లో ఎక్కువ‌గా క‌నిపించి అల‌రించారు. అయితే ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ఈమె పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఇక ఝాన్సీ ముక్కు సూటి మ‌నిషి అని చెప్ప‌వ‌చ్చు. ఆమె ఏం ఉన్నా స‌రే ముఖం మీదే చెప్పేస్తారు. ఈ క్ర‌మంలోనే ఆమె జీవితంలోనూ అనేక క‌ష్ట‌న‌ష్టాల‌ను చ‌వి చూసింది.

Anchor Jhansi said about media is over acting
Anchor Jhansi

ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె జీవితం, సంసారం స‌రిగ్గా సాగ‌లేదు. ఒక కుమార్తె జ‌న్మించాక ఆమె భ‌ర్త‌తో విడాకులు తీసుకున్నారు. జోగి బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రిని ఆమె పెళ్లి చేసుకున్న విష‌యం విదిత‌మే. ఇక ఆమెకు చిన్న వ‌యస్సులోనే విడాకులు అయ్యాయి. కానీ ఆమె మ‌రో పెళ్లి చేసుకోలేదు. కుమార్తెను గారాబంగా పెంచుకుంటూ జీవితం గ‌డుపుతోంది. ఇక త‌న కుమార్తె మాత్ర‌మే కాక ఆమె ఇంకో ఇద్ద‌రిని ద‌త్త‌త తీసుకుని చ‌దివిస్తోంది. ఆమె దాతృత్వ గుణం ఎలాంటిదో ఈ ఒక్క విష‌యం చాలు.

ఇక ఝాన్సీ ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. త‌న‌కు సంబంధించిన ప‌లు విశేషాల‌ను ఆమె తెలియ‌జేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో సోష‌ల్ మీడియాలో తాను చేసిన సెటైరిక‌ల్ పోస్ట్ వెనుక ఆంత‌ర్యం ఏమిటో ఝాన్సీ తెలిపింది. ప్ర‌స్తుతం మీడియా అతి ఎక్కువ‌గా చేస్తుంద‌ని.. సెల‌బ్రిటీల జీవితాల్లోకి తొంగి చూస్తున్నార‌ని.. నానా హ‌డావిడి చేస్తున్నార‌ని.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక మా ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను.. అన‌గ‌న‌గా ఒక ఎద్దు, దానికొక పుండు, పుండులో పురుగులు, ఏంటీ కాకుల గోల‌.. అని తాను మీడియాను ఉద్దేశించే అన్నాన‌ని.. అయితే ఈ పోస్టు తాను టాలీవుడ్‌ను ఉద్దేశించి పెట్టాన‌ని కొంద‌రు భావించార‌ని చెప్పింది.

ఇక ఝాన్సీ త‌నకు ఇష్ట‌మైన ఆహారం గురించి కూడా చెప్పింది. త‌న‌కు రాగి సంగ‌టి, జొన్న అన్నం, చ‌ద్ద‌న్నం, ప‌చ్చి పులుసు, ప‌చ్చి మిర్చి, ఉల్లిపాయ వంటివి చాలా ఇష్ట‌మ‌ని, పండ్ల ర‌సాల‌ను ఎక్కువ‌గా తాగుతాన‌ని.. తెలిపింది. త‌న కుమార్తె పేరు ధ‌న్య అని.. ఢిల్లీలో బ‌యోటెక్ రీసెర్చ‌ర్‌గా చేస్తుంద‌ని, ఆమెకు వ‌యొలిన్ వాయించ‌డం తెలుస‌ని, భ‌ర‌త నాట్యం కూడా నేర్చుకుంటుంద‌ని చెప్పింది. త‌న కుమార్తె న‌టి కావాల‌నుకుంటే తాను వ‌ద్ద‌ని చెప్ప‌బోన‌ని.. కానీ ఆమె సైంటిస్టు కావాల‌ని క‌ల‌లు కంటుంద‌ని.. ఝాన్సీ తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now