Anasuya : బుల్లితెర, వెండితెరకు సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది అనసూయ. ఈ అమ్మడు తన చలాకీ మాటలతోపాటు క్యూట్ క్యూట్ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలోనూ దాక్షాయణి పాత్రలోనూ అదరగొట్టింది అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం అనసూయ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తాండ సినిమాలోనూ నటిస్తోంది.
ఒకవైపు వెండితెర.. మరో వైపు బుల్లితెర.. రెండింటినీ మేనేజ్ చేస్తూ ముందుకు సాగుతోంది. స్పెషల్ ఈవెంట్స్ లోనూ అనసూయ తప్పక ఉండాల్సిందే అన్న చందాన మారింది. అనసూయ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు ఆ ప్రోగ్రామ్ కలర్ ఫుల్ గా మారిపోయినట్టే. అందులోనూ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కుర్రకారుని కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్‌లో అనసూయ సరికొత్త లుక్‌లో మెరిసింది. ఉగాది కోసం బుల్లి తెర తారలు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి టెలికాస్ట్ కాబోతోంది. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఉగాది సందర్భంగా ట్రెడిషనల్ ప్లస్ ఫ్యాషన్ రెండూ మిక్స్ చేసిన డ్రెస్ ధరించింది అనసూయ. అనసూయకు వరుసగా పంచ్ లు వేయడానికి పోటీపడ్డారు. యాంకర్ రవితోపాటు బిగ్ బాస్ విన్నర్ సన్నీ, యూట్యూబర్ నిఖిల్ అనసూయని ఏడిపించాలని తెగట్రై చేశారు. అనసూయ కూడా తనదైన స్టైల్ లో పంచులతో హడావిడి చేసింది. ఇక జాతకం చూపించుకోవడం కోసం ముక్కు అవినాష్ కు నిఖిల్ చేయి చూపించగా.. గీతలు అరిగిపోయాయి.. అలా రుద్దుతున్నావ్ అంటూ నిఖిల్ పై సెటైర్ వేసింది అనసూయ. నిఖిల్ కూడా అనసూయన్ టార్గెట్ చేస్తూ వరుస పంచులు వేశాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా నిఖిల్ అమాంతం అనసూయని పైకి ఎత్తాడు. దీంతో ఉలిక్కిపడింది. దింపమని గోల పెట్టినా కూడా దింపకపోయేసరికి అందరూ షాక్ అయ్యారు.
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ…
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి…
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…