Anasuya : అన‌సూయ‌ని అలా ఎత్తుకున్నాడేంటి.. గోల పెడుతున్నా దింప‌ట్లేదుగా..!

April 2, 2022 9:12 AM

Anasuya : బుల్లితెర‌, వెండితెర‌కు సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారింది అన‌సూయ‌. ఈ అమ్మ‌డు త‌న చ‌లాకీ మాట‌ల‌తోపాటు క్యూట్ క్యూట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలోనూ దాక్షాయణి పాత్రలోనూ అదరగొట్టింది అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం అనసూయ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తాండ సినిమాలోనూ నటిస్తోంది.

Anasuya latest Ugadi event video viral
Anasuya

ఒక‌వైపు వెండితెర.. మ‌రో వైపు బుల్లితెర.. రెండింటినీ మేనేజ్ చేస్తూ ముందుకు సాగుతోంది. స్పెష‌ల్ ఈవెంట్స్ లోనూ అన‌సూయ త‌ప్ప‌క ఉండాల్సిందే అన్న చందాన మారింది. అనసూయ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు ఆ ప్రోగ్రామ్ కలర్ ఫుల్ గా మారిపోయినట్టే. అందులోనూ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కుర్ర‌కారుని క‌ళ్లు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తోంది. ఉగాది స్పెష‌ల్ ప్రోగ్రామ్‌లో అన‌సూయ స‌రికొత్త లుక్‌లో మెరిసింది. ఉగాది కోసం బుల్లి తెర తారలు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి టెలికాస్ట్ కాబోతోంది. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఉగాది సందర్భంగా ట్రెడిషనల్ ప్లస్ ఫ్యాషన్ రెండూ మిక్స్ చేసిన డ్రెస్ ధ‌రించింది అన‌సూయ‌. అనసూయకు వరుసగా పంచ్ లు వేయడానికి పోటీపడ్డారు. యాంకర్ రవితోపాటు బిగ్ బాస్ విన్నర్ సన్నీ, యూట్యూబర్ నిఖిల్ అనసూయని ఏడిపించాలని తెగట్రై చేశారు. అనసూయ కూడా తనదైన స్టైల్ లో పంచులతో హడావిడి చేసింది. ఇక జాతకం చూపించుకోవడం కోసం ముక్కు అవినాష్ కు నిఖిల్ చేయి చూపించగా.. గీతలు అరిగిపోయాయి.. అలా రుద్దుతున్నావ్ అంటూ నిఖిల్ పై సెటైర్ వేసింది అనసూయ. నిఖిల్ కూడా అనసూయన్ టార్గెట్ చేస్తూ వరుస పంచులు వేశాడు. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నిఖిల్ అమాంతం అన‌సూయ‌ని పైకి ఎత్తాడు. దీంతో ఉలిక్కిప‌డింది. దింప‌మ‌ని గోల పెట్టినా కూడా దింప‌క‌పోయేస‌రికి అంద‌రూ షాక్ అయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now