Anasuya : అదిరిపోయే రీతిలో అన‌సూయ ఫొటోలు.. మ‌తులు పోగొడుతోంది..!

April 2, 2022 12:51 PM

Anasuya : న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారింది అనసూయ . జబర్దస్త్ కారణంగా అతికొద్ది సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఈ షో త‌ర్వాత అన‌సూయ రేంజ్ మాములుగా లేదు. బుల్లితెర‌పై రాణిస్తున్న స‌మ‌యంలోనే వెండితెర ఆఫ‌ర్స్ కూడా అందుకుంది. క్ష‌ణం చిత్రంతో అల‌రించిన అన‌సూయ రంగ‌స్థ‌లం చిత్రంతో భారీ ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఇక అక్క‌డ నుండి ఈ అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదు. వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటోంది. పెద్ద పెద్ద హీరోల‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తోంది. రీసెంట్ గా అనసూయ.. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో దాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో.. అనే ఆసక్తి పెరిగింది.

Anasuya latest Ugadi event photos become sensation
Anasuya

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ అడపా దడపా కొన్ని విషయాల మీద స్పందిస్తూ ట్రోల్స్ కు గురవుతుంటుంది. ఈ విషయంలో ఆమె చాలా సందర్భాల్లో స్పందించింది కూడా. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో మీమ్ పేజీలు, ట్రోల్ పేజీలు అన్నీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలు అప్‌లోడ్‌ చేయడంతో ఆమె ఆ విషయం మీద కౌంటర్ ఇచ్చింది. ఓ..! ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభించే రోజు ఇది. 24 గంటల్లో ముగుస్తుంది. కాబట్టి మహిళలందరూ మినహాయిస్తే..! హ్యాపీ ఫూల్స్ డే. గుమ్మడికాయ దొంగలను కామెంట్స్ లో చూడొచ్చు.. అని పేర్కొంది. దీనిపై నెటిజ‌న్స్ మ‌ళ్లీ ఆమెను ట్రోల్ చేశారు.

ఏది ఎలా ఉన్నా కూడా అన‌సూయ త‌న అంద‌చందాల‌తో ఎప్పుడు అల‌రిస్తూనే ఉంటుంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రాం కోసం అనసూయ విభిన్నమైన అవుట్ ఫిట్ లో మెరిసింది. ఇటు క్లాస్ అటు మాస్ అన్న‌ట్టుగా అన‌సూయ లుక్ ఉంది. ఈ అమ్మ‌డిని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రూ మైమ‌ర‌చిపోతున్నారు. అన‌సూయ అంద‌చందాల‌కు కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. అన‌సూయ గ్లామ‌ర్ ఫొటోలు షేర్ చేస్తే సోష‌ల్ మీడియా ఎలా షేక్ అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఆమె తాజా ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now