Anasuya : బుల్లితెర, వెండితెర వేదిక ఏదైనా సరే తన అందచందాలతో అలరిస్తోంది అనసూయ భరద్వాజ్. పలు టీవి షోలలో యాంకరింగ్ చేస్తూనే.. వెండితెరపై పలు చిత్రాల్లో నటిస్తూ తన టాలెంట్‌తో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. తన లేటెస్ట్ ఫొటోస్ నీ ఎప్పటికప్పుడే తన సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఈ బ్యూటీ ఏ ఫొటోలు షేర్ చేసినా క్షణాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం అనసూయ తన సోషల్ మీడియా వేదికగా మేకప్ లేకుండా ఒరిజినల్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చింది. నేచురల్ ఫోటో షూట్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోలు తన కొడుకు తీశారంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మురిసిపోయింది. ఇక అనసూయ నేచురల్ లుక్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటిగా బిజీ అయిన అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ కి దూరంగా ఉంటుంది. తనకు మంచి గుర్తింపు తెచ్చిన జబర్దస్త్ తో పాటు పలు బుల్లితెర షోస్ కి కూడా గుడ్ బై చెప్పేసింది అనసూయ.
అనసూయకు సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ ఆఫర్స్ రావడంతో అటువైపుగా అడుగులు వేస్తూ ముందుకు కొనసాగుతుంది. అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి ఓ పవర్ ఫుల్ రోల్ లో ప్రేక్షకులను మెప్పించారు. అయితే గాడ్ ఫాదర్ చిత్ర ప్రమోషన్స్ లో అనసూయ పాల్గొనలేదని మెగా ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్స్ తో బిజీగా ఉండటం వలన గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయానని అనసూయ తన ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ శాంతించారు.
ఇక వెండితెర ఆఫర్స్ తో పాటు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం అనసూయ ఖాతాలో పుష్ప 2 వంటి పాన్ ఇండియా మూవీ ఉంది. పుష్ప పార్ట్ 1లో అనసూయ దాక్షాయణిగా నెగిటివ్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. చిత్రంలో తన క్యారెక్టర్ కనిపించింది కొద్దిసేపై అయినా కూడా తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్స్ సంబంధించిన పనులు సరవేగంగా జరుగుతున్నాయి. పదేళ్ల కెరీర్లో అనసూయ కోట్ల సంపాదనతో బాగా సెటిల్ అయినట్లు సమాచారం. అనసూయ ఒక్కొక్క కాల్షీట్ కి రూ. 2 నుండి 3 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…