Anasuya : మేక‌ప్ లేకుండా త‌న ఫొటోల‌ను బ‌య‌ట పెట్టిన అన‌సూయ‌.. ఎలా ఉందో చూశారా..?

November 24, 2022 1:05 PM

Anasuya : బుల్లితెర, వెండితెర వేదిక ఏదైనా సరే తన అందచందాలతో అలరిస్తోంది అనసూయ భరద్వాజ్. పలు టీవి షోలలో యాంకరింగ్ చేస్తూనే.. వెండితెరపై పలు చిత్రాల్లో నటిస్తూ తన టాలెంట్‌తో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. తన లేటెస్ట్ ఫొటోస్ నీ ఎప్పటికప్పుడే తన సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఈ బ్యూటీ ఏ ఫొటోలు షేర్ చేసినా క్షణాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం అనసూయ తన సోషల్ మీడియా వేదికగా మేకప్ లేకుండా ఒరిజినల్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చింది. నేచురల్ ఫోటో షూట్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోలు తన కొడుకు తీశారంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మురిసిపోయింది. ఇక అనసూయ నేచురల్ లుక్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటిగా బిజీ అయిన అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ కి దూరంగా ఉంటుంది. తనకు మంచి గుర్తింపు తెచ్చిన జబర్దస్త్ తో పాటు పలు బుల్లితెర షోస్ కి కూడా గుడ్ బై చెప్పేసింది అనసూయ.

Anasuya latest green color dress photos viral
Anasuya

అనసూయకు సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ ఆఫర్స్ రావడంతో అటువైపుగా అడుగులు వేస్తూ ముందుకు కొనసాగుతుంది. అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి ఓ పవర్ ఫుల్ రోల్ లో ప్రేక్షకులను మెప్పించారు. అయితే గాడ్ ఫాదర్ చిత్ర ప్రమోషన్స్ లో అనసూయ పాల్గొనలేదని మెగా ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్స్ తో బిజీగా ఉండటం వలన గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయానని అనసూయ తన ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ శాంతించారు.

ఇక వెండితెర ఆఫర్స్ తో పాటు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం అనసూయ ఖాతాలో పుష్ప 2 వంటి పాన్ ఇండియా మూవీ ఉంది. పుష్ప పార్ట్ 1లో అనసూయ దాక్షాయణిగా నెగిటివ్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. చిత్రంలో తన క్యారెక్టర్ కనిపించింది కొద్దిసేపై అయినా కూడా తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్స్ సంబంధించిన పనులు సరవేగంగా జరుగుతున్నాయి. పదేళ్ల కెరీర్లో అనసూయ కోట్ల సంపాదనతో బాగా సెటిల్ అయినట్లు సమాచారం. అనసూయ ఒక్కొక్క కాల్షీట్ కి రూ. 2 నుండి 3 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now