Anasuya Kota Srinivasa Rao : కోట శ్రీనివాస రావుపై అనసూయ సెటైర్‌.. కోట వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన అనసూయ..

October 19, 2021 10:24 AM

Anasuya Kota Srinivasa Rao : ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటన ద్వారా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా పలు ఇంటర్వ్యూలకు హాజరు అవుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ యాంకర్ అనసూయ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనసూయ నటన పరంగా, డాన్స్ పరంగా ఎంతో అద్భుతంగా చేస్తుందని, ఆమె వస్త్రధారణ ఏమాత్రం బాగుండని బయటకు చెప్పేశారు.

Anasuya Kota Srinivasa Rao anasuya given counter to kota

కోట శ్రీనివాస్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీటిపై అనసూయ స్పందిస్తూ ఘాటుగా విమర్శలు చేసింది. కోట శ్రీనివాస రావు పేరు ఎత్తకుండా కొందరు సీనియర్ నటులు నా వస్త్రధారణ గురించి కామెంట్లు చేస్తున్నారు. అయితే నా వస్త్రధారణ అనేది నా వ్యక్తిగతం. నా వృత్తి ఆధారంగా వేసుకోవాల్సి వస్తుంది. అయినా ఆయన నటించిన ఎన్నో సినిమాలలో మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి. వీటి గురించి ఎవరూ ప్రశ్నించరా.. అంటూ ఆమె సందేహాలను వ్యక్తం చేసింది.

అదే విధంగా తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని.. తాను జీవితంలో ఎదగడం కోసం ఎంతో కష్టపడుతున్నానని.. మీకు నచ్చడం లేదా ? అలాగైతే మీ పని మీరు చూసుకోండి.. అంటూ ఇన్ డైరెక్ట్ గా కోట శ్రీనివాస్ రావు వ్యాఖ్యలకు స్పందించి తనదైన శైలిలో అనసూయ కౌంటర్‌ ఇచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment