Anasuya : తెలుగు ప్రేక్షకులకు అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రంగమ్మత్తగా పేరుగాంచిన అనసూయ అటు బుల్లితెరతోపాటు ఇటు వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంటుంది. ఈ మధ్య కాలంలో ఓ వైపు టీవీ షోలతోపాటు మరోవైపు సినిమాలతోనూ అనసూయ ఎంతో బిజీగా మారింది. అందులో భాగంగానే ఆమె వరుస సినిమాలను చేస్తూ అలరిస్తోంది. ఇక ఎప్పటికప్పుడు ఈమె తన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ మామూలుగా ఉండదు. గ్లామర్ ఫొటోషూట్స్‌తో అలరిస్తూనే.. తన సినిమాల అప్‌డేట్స్ గురించి చెబుతుంటుంది. అలాగే వెకేషన్స్‌కు కూడా వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఈ మధ్యే అనసూయ తన బర్త్ డేను జరుపుకోగా.. అందాల విందు చేసేలా ఫొటోలను షేర్ చేసింది. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఫొటోలనే ఆమె షేర్ చేసింది. తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త సుశాంక్ భరద్వాజ్‌తో కలిసి ఈమె వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ తీసుకున్న వీడియోను షేర్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పోస్ట్ చేసిన స్పెషల్ వీడియోకు అనసూయ కాప్షన్ ను కూడా పెట్టింది. తన భర్తను ముద్దుగా నిక్కు అని పిలుచుకుంటున్న అనసూయ.. తామిద్దరం అలా సంతోషంగా గడుపుతున్నందుకు ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. ఇద్దరం ఇలాగే జీవితాంతం కలసి మెలసి ఉండాలని కోరుకుంటున్నానని..21 ఏళ్ల నుంచి ఇద్దరం కలసి ఉంటున్నాం.. 12 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్నాం.. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.. అంటూ అనసూయ కాప్షన్ పెట్టింది.
ఇక సినిమాల విషయానికి వస్తే అనసూయ పుష్పలో దాక్షాయణిగా అలరించగా.. త్వరలోనే పుష్ప 2వ పార్ట్‌లోనూ ఈమె నటించనుంది. ఈ మధ్యే విడుదలైన ఖిలాడి మూవీలోనూ అనసూయ నటించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇక భీష్మ పర్వం అనే మళయాళం మూవీతో అనసూయ మాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే గోపీచంద్ పక్కా కమర్షియల్‌లో ఈమె నటించింది. దీంతోపాటు రంగ మార్తాండ అనే మూవీలోనూ నటిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…