Pooja Hegde : ఒక లైలా కోసం అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ.. పూజా హెగ్డె. ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలో నటించిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈమెకు ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. అయితే అనూహ్యంగా ఈమె పుంజుకుంది. గతేడాది కాలం నుంచి ఈమె నటిస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. అయితే ఈ ఏడాదిలో మాత్రం ఈమెకు ఒక్క హిట్ కూడా లభించలేదు. రాధేశ్యామ్ మొదలు కొని బీస్ట్, ఆచార్య సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజాకు మళ్లీ ఐరన్ లెగ్ అన్న ముద్ర పడింది. అయితే ఈ మధ్యే విడుదలైన ఎఫ్3 మూవీలో ఈమె ఐటమ్ సాంగ్ చేసి అలరించింది. పూజా కాసేపు మాత్రమే ఉన్నప్పటికీ ఈ మూవీకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.
ఇక సోషల్ మీడియాలోనూ ఈ భామ ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. గతంలో ఈమె మాల్దీవ్స్ కు వెళ్లినప్పుడు సోషల్ మీడియాలో వరుసగా ఫొటోలను షేర్ చేసి సెగలు రేపింది. అయితే ఇప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని, వెకేషన్‌కు వెళ్లలేకపోతున్నానని చెబుతూ పూజా హెగ్డె అప్పటి ఫొటోలను మళ్లీ షేర్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తూ పూజా చేసిన గ్లామర్ షోకు కుర్రకారు మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె త్రో బాక్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. పూజా త్వరలోనే మహేష్‌తో కలిసి త్రివిక్రమ్ సినిమాలో చేయనుంది. గతంలో ఈమె మహేష్‌తో కలసి చేసిన మహర్షి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక త్రివిక్రమ్ కూడా వరుస హిట్‌లతో జోరుమీదున్నారు. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మరో హిట్ వస్తుందని అంటున్నారు. అలాగే సర్కస్, కభీ ఈద్ కభీ దివాలీ అనే హిందీ సినిమాల్లోనూ పూజా నటిస్తోంది. ఇవి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల కానున్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…