Anasuya : గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విషయంపై వార్తలలో నిలుస్తూ ఉంటుంది అనసూయ. టీవీ9 యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయకు పాపులారిటీ వచ్చింది మాత్రం జబర్దస్త్ షో ద్వారానే. తన మాటలతోనే కాకుండా అందచందాలతోనూ అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ యాంకరమ్మ. అనసూయ వేసుకొనే పొట్టి బట్టలపై ఒక్కోసారి వివాదం చెలరేగుతూ ఉంటుంది. వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా అనసూయ గ్లామర్ షోతో అటు బుల్లితెర ప్రేక్షకులను, ఇటు వెండితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
కొన్ని రోజుల క్రితం లైగర్ సినిమా ఫలితాన్ని ఉద్దేశిస్తూ.. పరోక్షంగా అనసూయ చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది. లైగర్ చిత్రం డివైడ్ టాక్ రావడంతో అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ రావడం ఒకోసారి లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.. అంటూ కామెంట్లు చేస్తూ రెచ్చిపోయింది. ఇక ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అసలే సినిమా పోయిందని బాధతో ఉన్న అభిమానులు అనసూయని టార్గెట్ చేస్తూ ఆంటీ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేయడం ప్రారంభించి దానిలో భాగంగానే ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో తనను ఆంటీ అన్న వారిపై కేసు నమోదు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ వివాదంపై నటుడు బ్రహ్మాజీ సైతం ఇన్‌డైరెక్ట్‌గా అనసూయపై సెటైర్లు వేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వివాదం నెమ్మదిగా సద్దుమణిగింది.
అయితే మాటల ప్రవాహం యాంకర్ సుమ నిర్వహించే క్రేజీ కిచెన్ అనే వంటల కార్యక్రమంలో అనసూయ పాల్గొన్నది. ఈ సందర్భంగా అనసూయ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చాలా మంది తనకు వంటలు రావని అనుకుంటారని.. కానీ తాను చాలా బాగా వంట చేస్తానని చెప్పుకొచ్చింది. తాను ఎంత బాగా వండుతానో.. ఈ షో ద్వారా అందరికీ తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక సుమతో మాటల సందర్భంలో ఆంటీ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ షో ద్వారా అనసూయ స్పందిస్తూ.. నిజంగా చెప్పాలంటే.. అత్తా, పిత్తా అని పిలవడం నాకు అస్సలు నచ్చదు. చివరికి నా కోడలైనా సరే.. నన్ను అత్త అని పిలిస్తే ఊరుకోను. జస్ట్ అనసూయ.. అను.. అని పిలిస్తే సరిపోతుంది అని చెప్పింది. దీంతో మరోసారి ఆంటీ వివాదం తెరమీదకు వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…