Anasuya : త‌న‌ను ఆంటీ అన‌డంపై మ‌ళ్లీ స్పందించిన అన‌సూయ‌.. ఈసారి ఏమ‌న్న‌దంటే..?

September 22, 2022 3:49 PM

Anasuya : గ్లామరస్ యాంకర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. నిత్యం ఏదో ఒక విష‌యంపై వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది అనసూయ. టీవీ9 యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయకు పాపులారిటీ వచ్చింది మాత్రం జబర్దస్త్ షో ద్వారానే. తన మాటలతోనే కాకుండా అందచందాలతోనూ అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ యాంకరమ్మ. అనసూయ వేసుకొనే పొట్టి బట్టలపై ఒక్కోసారి వివాదం చెలరేగుతూ ఉంటుంది. వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా అనసూయ గ్లామర్ షోతో అటు బుల్లితెర ప్రేక్షకులను, ఇటు వెండితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కొన్ని రోజుల క్రితం లైగర్ సినిమా ఫలితాన్ని ఉద్దేశిస్తూ.. పరోక్షంగా అనసూయ చేసిన ట్వీట్‌ వివాదానికి దారి తీసింది. లైగర్ చిత్రం డివైడ్ టాక్ రావడంతో అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ రావడం ఒకోసారి లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.. అంటూ కామెంట్లు చేస్తూ రెచ్చిపోయింది. ఇక ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అసలే సినిమా పోయిందని బాధతో ఉన్న అభిమానులు అనసూయని టార్గెట్ చేస్తూ ఆంటీ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేయడం ప్రారంభించి దానిలో భాగంగానే ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో తనను ఆంటీ అన్న వారిపై కేసు నమోదు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ వివాదంపై నటుడు బ్రహ్మాజీ సైతం ఇన్‌డైరెక్ట్‌గా అనసూయపై సెటైర్లు వేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వివాదం నెమ్మదిగా సద్దుమణిగింది.

Anasuya again responded on recent comments on her
Anasuya

అయితే మాటల ప్రవాహం యాంకర్ సుమ నిర్వహించే క్రేజీ కిచెన్ అనే వంటల కార్యక్రమంలో అనసూయ పాల్గొన్నది. ఈ సందర్భంగా అనసూయ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చాలా మంది తనకు వంటలు రావని అనుకుంటారని.. కానీ తాను చాలా బాగా వంట చేస్తానని చెప్పుకొచ్చింది. తాను ఎంత బాగా వండుతానో.. ఈ షో ద్వారా అందరికీ తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక సుమతో మాటల సందర్భంలో ఆంటీ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ షో ద్వారా అనసూయ స్పందిస్తూ.. నిజంగా చెప్పాలంటే.. అత్తా, పిత్తా అని పిలవడం నాకు అస్సలు నచ్చదు. చివరికి నా కోడలైనా సరే.. నన్ను అత్త అని పిలిస్తే ఊరుకోను. జస్ట్ అనసూయ.. అను.. అని పిలిస్తే సరిపోతుంది అని చెప్పింది. దీంతో మరోసారి ఆంటీ వివాదం తెరమీదకు వచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now